వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌కు రాబోయే కష్టాన్ని కనిపెట్టాడు: యువకుడికి రూ.7లక్షల బహుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొల్లం: కొల్లంకు చెందిన ఇరవై ఏళ్ల యువకుడు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ నుంచి రూ.7 లక్షల రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. ఎస్ అరుణ్ కుమార్ విద్యార్థి కంప్యూటర్ ఇంజినీర్ స్టూడెంట్. అతను చత్తనూర్‌లోని ఎంఈఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్నాడు.

ఇతనికి ఫేస్‌బుక్ ప్రైజ్ మనీ ఇచ్చింది. అతను బగ్‌ను కనుగొని చెప్పినందుకు ఈ బహుమతి ఇచ్చారు. అతనికి బహుమతితో పాటు ప్రశంసలు కూడా లభించాయి. అరుణ్ కుమార్ నిత్యం ఫేస్‌బుక్‌లో ఉంటాడు. ఈ సందర్భంగా అతను ఫేస్‌బుక్‌ను కుదిపేసే ఓ బగ్‌ను కనుగొన్నాడు.

Kollam Youth Wins Rs 7 Lakh Prize From Facebook

అతను మాట్లాడుతూ.. తాను రోజూలాగే ఫేస్‌బుక్‌ను సెర్చ్ చేస్తుంటే లుక్ఎసైడ్.ఫేస్‌బుక్‌.కామ్ అనే డొమైన్ కనిపించిందని, ఈ డొమైన్‌కు ఫుల్ అకౌంట్ టేకోవర్ అనే మాల్ ఫంక్షన్ అఫెక్ట్ అయినట్లు తాను గుర్తించానని చెప్పాడు. దీంతో హ్యాకర్లు పది నిమిషాల్లోనే ఇతరుల ఫేస్‌బుక్‌ అకౌంట్లలోకి అక్రమంగా చొరబడవచ్చునని గుర్తించినట్లు చెప్పాడు.

తాను ఈ ఏడాది మార్చి నెలలో దీనిని గుర్తించానని, ఫేస్‌బుక్‌ అధికారులు తొలుత ఈ లోపాన్ని అంగీకరించలేదని చెప్పాడు. అనేకసార్లు చెప్పిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించారన్నారు. ఫేస్‌బుక్‌ నుంచి ప్రశంసలు అందుకోవడం తనకు ఇదే తొలిసారి కాదన్నాడు. ఫేస్‌బుక్‌ భద్రతా లోపాల గురించి చెప్పడంతో తనను 2014, 2015 సంవత్సరాల్లో ఫేస్‌బుక్‌ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చిందన్నాడు.

English summary
A 20 year old computer geek’s casual outing in online platform has won him a cash prize of 7 lakh from social media giant Facebook. Arun S Kumar, a computer engineering student with the MES Institute of Technology and Management, Chathanoor here, said that the prize money was presented to him for his discovery of a bug, which has the magnitude to bring down the Facebook into shambles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X