వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Koo App:ట్విటర్ వద్దు.. "కూ" ముద్దు: దేశీ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న కేంద్రం- భారత్‌లో పిట్ట ఎగరదా..?

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం భారత్‌లో స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేకిన్ ఇండియా కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్‌లో తయారయ్యే ఉత్పత్తుల గురించి నేడు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక తాజాగా భారత్‌లో ట్విటర్‌ను పోలిన మైక్రో బ్లాగింగ్ సైట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిపేరే కూ (Koo)యాప్. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కూ యాప్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ యాప్‌పై పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అకౌంట్లను క్రియేట్ చేసుకున్నారు.

ట్విటర్‌కు టైమ్ దగ్గర పడిందా

ట్విటర్‌కు టైమ్ దగ్గర పడిందా

కూ యాప్‌ను ప్రమోట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు ట్విటర్ స్పందించకపోవడంతో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ కూ యాప్ వైపు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రైతు నిరసనలకు సంబంధించి కొందరు ట్విటర్ వేదికగా తప్పుడు ప్రచారాలకు దిగుతుండటంతో వారి ఖాతాలను మూసివేయాలంటూ కేంద్రం ట్విటర్‌ను కోరడంతో పెడచెవిన పెట్టింది. పాకిస్తాన్, లేదా ఖలిస్తాన్‌లకు సానుభూతిపరులకు సంబంధించిన 1000 ట్విటర్ ఖాతాలను తొలగించాలని కోరుతూ కేంద్రం ట్విటర్‌కు నోటీసులు ఇచ్చింది. నోటీసులకు స్పందించలేదు. అదే సమయంలో భారత్‌లో ట్విటర్ సంస్థ పాలసీ హెడ్ మహిమా కౌల్ కూడా రాజీనామా చేశారు.

నోటీసులకు స్పందించని ట్విటర్

నోటీసులకు స్పందించని ట్విటర్

ట్విటర్‌ను భారత్‌లో సస్పెండ్ చేయాలంటూ పలు కథనాలను మీడియా ప్రసారం చేసింది. అంతేకాదు పలువురు కేంద్ర మంత్రులు, ప్రభత్వ సంస్థలు ట్విటర్ ప్రత్యామ్నాయ దేశీ యాప్‌ కూలో ఖాతాలు తెరవడం ద్వారా ట్విటర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కూ యాప్ అనే ఈ దేశీ యాప్ ట్విటర్‌ను పోలి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ట్విటర్‌కు ప్రత్యామ్నాయ యాప్‌గా తయారైంది. గతేడాది మార్చిలో దీన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌ యాప్ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో కూ యాప్‌ తొలి వరుసలో నిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ యాప్‌ను మిలియన్ మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. భారతీయులు కూ యాప్‌ను వినియోగించాలని ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ ద్వారా పిలుపునిచ్చారు.

కూ యాప్ రూపకర్తలు ఎవరు..?

కూ యాప్ రూపకర్తలు ఎవరు..?


కూయాప్‌ను అప్రమేయ రాధా కృష్ణ మరియు మయాంక్ బిద్వాక్తలు రూపొందించారు. వీరి ద్వయం టాక్సీ ఫర్ శూర్, రెడ్ బస్ లాంటి స్టార్టప్‌లను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం కూ యాప్‌ను రూపొందించారు. ఇది నాలు ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఉండగా... త్వరలోనే మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బంగ్లా, ఒరియా, మలయాళం, అస్సామీ భాషల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కూ యాప్ ద్వారా యూజర్లు టెక్ట్స్ మెసేజ్‌లు, వీడియోలు, ఆడియోలు పంపే అవకాశం ఉంది. యూజర్ చెప్పదల్చుకుంది 400 క్యారెక్టర్లలో చెప్పడం లేదా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియో ద్వారా పోస్టు చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్, మరియు యాపిల్ యాప్ స్టోర్ పై కూ యాప్ లభిస్తుంది.

కూ యాప్‌లో పలువురు ప్రముఖులు సంస్థలు


కూ యాప్‌లో పలువురు ప్రముఖులు చేరారు. వీరిలో మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు... సద్గురు, రవిశంకర్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్‌లాంటి ప్రముఖులు కూడా కూ యాప్‌పై అకౌంట్ తెరిచారు. ఇక కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇండియా, ఇండియా పోస్టు, ఎన్‌ఐసీ, NIELT, సమీర్, కామన్ సర్వీసెస్ సెంటర్, ఉమాంగ్ యాప్, డిజి లాకర్, నిక్సి, ఎస్‌టీపీఐ, సీడాక్, సీమెట్ లాంటి కేంద్ర సంస్థలు కూడా అకౌంట్ తెరిచాయి.

English summary
Government of India is encouraging Indians to Use the Desi app Koo which is an alternative to twitter and also to encourage the Atmanirbhar bharat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X