వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరీరంలో 100కి పైగా సూదులు: స్కానింగ్ రిపోర్టు చూసి డాక్టర్ల షాక్..

పేషెంట్ శరీరంలోని ఆహార వాహిక, శ్వాసనాళం, ఇతర ముఖ్య భాగాల్లో ఇంకా 60వరకు గుండుపిన్నులు ఉన్నట్లు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. పేషెంట్ స్కానింగ్ రిపోర్టు చూసి డాక్టర్లే షాక్ తిన్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అతని శరీరంలో 100కి పైగా సూదులు ఉన్నట్లు గుర్తించారు. కడుపులోకి అవెలా చేరాయో తెలియదు గానీ శస్త్ర చికిత్స ద్వారా ఇప్పటివరకు 92గుండుపిన్నులు తొలగించారు.

పేషెంట్ శరీరంలోని ఆహార వాహిక, శ్వాసనాళం, ఇతర ముఖ్య భాగాల్లో ఇంకా 60వరకు గుండుపిన్నులు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన 56ఏళ్ల బద్రిలాల్ అనే రైల్వే ఉద్యోగి శరీరంలో ఈ సూదులు బయటపడ్డాయి.షుగర్ పేషెంట్ అయిన తనకు ఇటీవల ఓ గుండు పిన్ను గుచ్చుకోవడంతో.. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాడు.

Kota man is now being called 'Pin Man' after doctors remove 92 needles from his body

పూర్తి స్థాయి పరీక్షల కోసం బాడీ స్కాన్ చేసిన వైద్యులు.. శరీరంలో ఉన్న సూదులు చూసి అవాక్కయ్యారు. అతికష్టం మీద 92సూదులను తొలగించినప్పటికీ.. మరో 60సూదులు తొలగించాల్సి ఉందని చెబుతున్నారు. వైద్యం కోసం గతంలో ఏ ఆసుపత్రిని సంప్రదించినా.. తనకు ట్రీట్ మెంట్ ఇవ్వలేదని, ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఇప్పుడు చికిత్స అందించారని పేషెంట్ పేర్కొన్నారు.

అయితే తన శరీరంలో సూదులు ఉన్నట్లు తనకు తెలియని పేషెంట్ పేర్కొనడం గమనార్హం. గత మూడు నెలల వ్యవధిలో 30కిలోల బరువు తగ్గడం.. కాలికి అయిన గాయం కూడా మానకపోవడంతో అతను వైద్యులను సంప్రదించాడు. దీంతో అసలు సమస్య వెలుగుచూసింది.

English summary
In one of the most bizarre cases that could have come walking into a hospital, a 56-year-old railway employee from Kota arrived with a total of 150 pins inside various parts of his body, including critical places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X