వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kozhikode Plane Crash:విమానం బ్లాక్ బాక్స్ స్వాధీనం.. అన్ని వాస్తవాలు అప్పుడే వెలుగులోకి..!

|
Google Oneindia TeluguNews

కోజికోడ్: దుబాయ్ - కోజికోడ్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనా స్థలం నుంచి అధికారులు బ్లాక్‌బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకున్న ఎయిరిండియా విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సందర్భంలో స్కిడ్ అయి క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ఎయిరిండియా IX1344లో మొత్తం 190 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ప్రమాదం జరగక ముందు పైలట్లు ఏమి మాట్లాడుకున్నారో, ల్యాండింగ్ సమయంలో రన్‌వే కనిపించిందా లేదా, ఏటీసీకి ఎలాంటి సంకేతాలు పంపారో అనేటువంటి అంశాలు బ్లాక్‌బాక్సులో రికార్డ్ అయి ఉంటాయి.

బ్లాక్ బాక్స్ స్వాధీనం

బ్లాక్ బాక్స్ స్వాధీనం

ఇక ప్రమాదం ఎలా జరిగిందో అనేదానిపై రకరకాల వార్తలు విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇక్కడే బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ ప్రమాదమనే కాదు... ఏ విమాన ప్రమాదమైనా, చాపర్ ప్రమాదమైనా ఆ ప్రమాదం ఎలా జరిగిందో అనేది బ్లాక్‌ బాక్స్‌లో నిక్షిప్తమైన రికార్డ్స్ వెల్లడిస్తాయి. ప్రస్తుతం కోజికోడ్ విమాన ప్రమాదంకు సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అసలు ప్రమాదానికి గల కారణాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తి కావడానికి 48 గంటల సమయం పడుతుంది.

విచారణలో కీలకంగా మారనున్న బ్లాక్ బాక్స్

విచారణలో కీలకంగా మారనున్న బ్లాక్ బాక్స్

బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకోవడంతో ఇక విచారణ మొత్తం విమానాయానశాఖలోని యాక్సిడెంట్ టీమ్ చేయనుంది. కొన్ని సందర్భాల్లో బ్లాక్‌ బాక్స్‌ను డీకోడ్ చేసేందుకు అమెరికాలోని విమానాయాన సంస్థకు పంపాల్సి ఉంటుంది. దీంతో మొత్తం దర్యాప్తు సమయం కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక బ్లాక్ బాక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి రెండు సార్లు గాలంట్రీ అవార్డు గ్రహీత అయిన గ్రూప్ కెప్టెన్ కేవీఎస్ఎన్ మూర్తి వివరించారు. బ్లాక్‌ బాక్స్ ప్రమాదం జరిగిన తీరును పూర్తి స్థాయిలో కళ్లముందుంచుతుందని ఆయన చెప్పారు. దర్యాప్తు చేసే బృందానికి పూర్తి వివరాలు ఈ బ్లాక్ బాక్స్ అందజేస్తుందని వివరించారు.

Recommended Video

Kozhikode 2020 VS Mangalore 2010 : సరిగ్గా పదేళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే ! || Oneindia Telugu
బ్లాక్‌బాక్స్‌లో అన్ని పారామీటర్లు

బ్లాక్‌బాక్స్‌లో అన్ని పారామీటర్లు

ప్రమాదానికి ముందు ఏం జరిగిందని విశ్లేషించడంలో బ్లాక్ బాక్స్ కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పిన కెప్టెన్ మూర్తి.. అన్ని పారామీటర్ల గురించి సమగ్ర వివరణ ఇస్తుందని చెప్పారు. అంటే విమానం ఎత్తు ఎంతలో ఉన్నింది, వేగం, థ్రస్ట్, యాక్సలరేషన్ లాంటి కీలక వివరాలు ఈ బ్లాక్ బాక్సులో నిక్షిప్తమై ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు పైలట్ ఆటోమేటెడ్ సిస్టంలో విమానంను నడిపారా..అసలు కాక్‌పిట్‌లో జరిగిన ప్రతి మినిట్ టూ మినిట్ వ్యవహారం బ్లాక్ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. అంతేకాదు పైలట్ల మధ్య జరిగిన సంభాషణలు కూడా బ్లాక్‌బాక్సులో రికార్డు అవుతాయి. వారి సంభాషణలు కీలకంగా మారనున్నాయి.

English summary
Black box was Recovered by the officials at the Kozhikode Crash site.This will turn as a crucial in the investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X