బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నా ఈనెల 8వ తేదీ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం ఒక చాలెంజ్ గా మారింది.

బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. బీజేపీ నాయకులు ఆపరేషన్ కమలకు మళ్లీ తెరలేపారని, మా పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఎరవేశారని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ఆరోపించారు.

ఎమ్మెల్యేల మద్దతు లేదు

ఎమ్మెల్యేల మద్దతు లేదు

ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి అవసరం అయ్యే ఎమ్మెల్యేల మద్దతు లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎమ్మెల్యేలు మద్తలు ఇవ్వరని, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం కాయమని ఆర్. అశోక్ జోస్యం చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఉండదని బీజేపీ నాయకులు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలకు గాలం !

ఎమ్మెల్యేలకు గాలం !

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు గాలం వేస్తున్నారని, వారు ఆపరేషన్ కమల చేపడుతున్నారని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ఆరోపించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన దినేష్ గుండూరావ్ బీజేపీ నాయకులు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చాలని, ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్ ఇస్తున్నారని, రూ. 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదని దినేష్ గుండూరావ్ ఆరోపించారు.

ప్రభుత్వం ఉన్నా లేనట్లే !

ప్రభుత్వం ఉన్నా లేనట్లే !


బీజేపీ నాయకులు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టుకునేపనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు బుట్టలో వేసుకున్నారు. ఇక 12 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అంటే బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే (106+2+12- 120) ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. ఆ సందర్బంలో కుమారస్వామి ప్రభుత్వం బడ్జెట్ ను ఆమోదించడానికి అవకాశం లేకుండాపోతుంది. తరువాత ఒక్క పైసా నిధులు ఖర్చు చెయ్యడానికి అవకాశం ఉండదని, సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని బీజేపీ నాయకులు అంటున్నారు.

 డబ్బు ఎలా వచ్చింది ?

డబ్బు ఎలా వచ్చింది ?

బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ చేసిన వ్యాఖ్యలపై కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేయ్యాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు, వారికి భారీ ఆఫర్లు ఇస్తున్న విషయం తెలుసుకుని ప్రజలు షాక్ కు గురౌతున్నారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. ఎమ్మెల్యేను కొనుగోలు చెయ్యడానికి బీజేపీ నాయకులకు ఇంత భారీ మొత్తంలో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది అనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలని దినేష్ గుండూరావ్ అన్నారు. బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి భారీ మొత్తంలో నగదు సమకూర్చుతున్నారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. సుమారు రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్లు ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి బీజేపీ నాయకులు సిద్దం అయ్యారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు.

అగ్రిమెంట్ మీద సంతకం ?

అగ్రిమెంట్ మీద సంతకం ?

అధికార పార్టీకి చెందిన దాదాపు 18 మంది నుంచి 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి, మీరు ఎక్కడికి నగదు పంపించాలో చెప్పండి పంపిస్తాం, లేదంటే మేము చెప్పిన చోటకు వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం చేసి డబ్బు తీసుకోండి అని బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలకు మభ్యపెడుతున్నారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. బీజేపీ నాయకులు మభ్య పెడుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనకు ఈ వివరాలు చెప్పారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. మొత్తం మీద ఆపరేషన్ కమల విషయంలో బీజేపీ నాయకులు బిజీ అయ్యారని దినేష్ గుండూరావ్ మండిపడ్డారు.

English summary
KPCC President Dinesh Gundurao revealed BJP offer to Congress MLAs to support their party. In his media conversation Gundurao said, BJP offering 30-40 crore rupees to our MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X