బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాఫీ డే కింగ్ కొడుకు, ట్రబుల్ షూటర్ కూతురు ఐశ్వర్య పెళ్లి, బిగ్ షాట్స్ పెళ్లి, బీజేపీ, కాంగ్రెస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాఫీ డే కింగ్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు సిద్దార్థ కుమారుడు, కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రుబల్ షూటర్ కుమార్తె వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి అయిన ఎస్,ఎం, కృష్ణ మనుమడు పెళ్లి కొడుకు కావడం, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ దగ్గర సమర్థ వంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కుమార్తె వివాహం త్వరలో జరగనుంది. పెళ్లి కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపారం చేస్తున్నది. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన పెళ్లి కొడుకు వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల ఇంట పెళ్లి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. పెళ్లి కుమార్తె తండ్రి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని లీడర్ కావడం ఇంత చర్చకు దారితీసింది.

Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు !Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు !

 బీజేపీ, కాంగ్రెస్ లో టాప్ లీడర్స్

బీజేపీ, కాంగ్రెస్ లో టాప్ లీడర్స్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్,ఎం, కృష్ణ బెంగళూరు సిటీని భారతదేశ ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి శక్తి వంచనలేకుండా పని చేశారు. అంతే కాకుండ యూపీఏ ప్రభుత్వంలో ఎస్,ఎం, కృష్ణ కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ దగ్గర సమర్థ వంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కర్ణాటకలో తిరుగులేని నాయకుడిగా, ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎస్,ఎం, కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఎస్,ఎం, కృష్ణ మనుమడు, డీకే, శివకుమార్ కుమార్తె పెళ్లి ఇప్పుడు నిశ్చయం అయ్యింది.

 కాఫీ డే కింగ్ కొడుకు

కాఫీ డే కింగ్ కొడుకు

ప్రపంచ వ్యాప్తంగా కాఫీ డేకి మంచి గుర్తింపు ఉంది. కాఫీ డే సంస్థ వ్యవస్థాపకుడు సిద్దార్థ మాజీ ముఖ్యమంత్రి ఎస్,ఎం, కృష్ణ కుమార్తె మాళవికను వివాహం చేసుకున్నాడు. సిద్దార్థ హెగ్డే, మళవిక దంపతుల కుమారుడు అమారాథ్య హెగ్డే (26) అమెరికాలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం భారత్ చేరుకుని తల్లి మాళవికతో కలిసి ఆయన తండ్రి స్థాపించిన వ్యాపార లావాదేవీలు, ఆ కార్యకలాపాలు చూసుకుంటున్నారు.

 పెళ్లి కూతురు బిగ్ షాట్

పెళ్లి కూతురు బిగ్ షాట్

ట్రుబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య (22) ప్రముఖ విద్యాసంస్థలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య గ్గోబల్ టెక్నాలజీ సంస్థను సొంతంగా నిర్వహిస్తున్నది. డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఆస్తి సుమారు రూ. 1, 000 కోట్లకు పైగా ఉంది.

 నాడు బెస్ట్ ఫ్రెండ్స్ నేడు వియ్యంకులు

నాడు బెస్ట్ ఫ్రెండ్స్ నేడు వియ్యంకులు

కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ, మాజీ మంత్రి డీకే. శివకుమార్ మంచి స్నేహితులు, ఏన్నో సంవత్సరాలుగా డీకే. శివకుమార్, సిద్దార్థ బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సిద్దార్థ మామ, మాజీ సీఎం ఎస్,ఎం, కృష్ణ మాటను ఏరోజు జవదాటని నాయకుడిగా డీకే. శివకుమార్ కు మంచిపేరు ఉంది. అలాంటి డీకే. శివకుమార్, సిద్దార్థ కుటుంబ సభ్యులు నేడు బంధువులు అవుతున్నారు.

 ఆత్మహత్యకు ముందు రోజు మాట ఇచ్చారు

ఆత్మహత్యకు ముందు రోజు మాట ఇచ్చారు

ఆర్థిక సమస్యల కారణంగా గత ఏడాది జులై నెలలో కాఫీ డే కింగ్ సిద్దార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దార్థ ఆత్మహత్య చేసుకునే ముందురోజు మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను కలిశారని తెలిసింది. ఆ రోజు తన కుమారుడు అమాథ్యతో మీ కుమార్తె ఐశ్వర్యల వివాహం చెయ్యాలని అనుకుంటున్నామని సిద్దార్థ అడిగారని తెలిసింది. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని ఆరోజు డీకే. శివకుమార్ సిద్దార్థకు మాట ఇచ్చారని తెలిసింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరుసటిరోజు సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ విషయం ఇన్ని రోజులు తెరవెనుకే ఉండిపోయింది.

 ఐశ్వర్య పెళ్లిపై ట్రుబల్ షూటర్ క్లారిటీ

ఐశ్వర్య పెళ్లిపై ట్రుబల్ షూటర్ క్లారిటీ

తన కుమార్తె ఐశ్వర్య పెళ్లి విషయంలో మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అనేది ఆ స్వర్గంలో నిర్ణయిస్తారని, ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి అని మాజీ మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. సిద్దార్థ చనిపోయి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత మంచి రోజు చూసి తన కుమార్తె ఐశ్వర్య, సిద్దార్థ కుమారుడు అమాథ్యల పెళ్లి జరిపిస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చారు.

 అక్టోబర్ లో పెళ్లి ?

అక్టోబర్ లో పెళ్లి ?

సిద్దార్థ మరణించడంతో ఆ ఇంట శుభకార్యం జరిపించాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ఇంటికి మాజీ సీఎం ఎస్,ఎం, కృష్ణ కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇదే సమయంలో ఐశ్వర్య, అమాథ్యల పెళ్లి విషయంపై చర్చ జరిగిందని తెలిసింది. మంచిరోజు చూసి పెళ్లి చేద్దామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆగస్టు నెలలో ఐశ్వర్య, అమాథ్యల వివాహ నిశ్చితార్థం జరిపించి అక్టోబర్ నెలలో గ్రాండ్ గా పెళ్లి జరిపించాలని ఇరు కుటంబ సభ్యులు నిర్ణయించారని తెలిసింది. మొత్తం మీద కాఫీడే కింగ్ కొడుకు అమాథ్య, ట్రబుల్ షూటర్ కుమార్తె ఐశ్వర్య ఓ ఇంటివారు కాబోతున్నారు.

English summary
Bengaluru: KPCC President DK Shivakumar's daughter Aishwarya to marry SM Krishna Grandson, VG Siddhartha's son Amartya Hegde.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X