బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

BJP-Congress: ఐశ్వర్య పెళ్లిచూపులు, అంతా ఓకే, ముహూర్తం డేట్ ఫిక్స్, రూ. వెయ్యి కోట్లు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనా కాలంలోనే మరో పెద్దల ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయ్యింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకుల ఇంట్లో జరుగుతున్న ఈ పెళ్లి గురించి ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ మనుమడు, కాఫీ డే కింగ్ సిద్దార్థ కుమారుడు, కేపీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి చూపులు జరిగిపోయాయి. పెళ్లి కుమార్తె ఐశ్వర్య పేరుతో ఆస్తి రూ. వెయ్యి కోట్లకు పైగా ఉంది.

ఇక మంచి రోజు ముహూర్తం చూసి పెళ్లి చెయ్యడమే మిగిలిందని ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడుకున్నారని వారి సన్నిహితులు తెలిపారు.

Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే?Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే?

గురు శిష్యులు గ్రేట్

గురు శిష్యులు గ్రేట్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ, కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ రాజకీయ గురు శిష్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. డీకే. శివకుమార్ దూకుడును కట్టడి చెయ్యాలంటే ఒక్క ఎస్ఎం. కృష్ణకు మాత్రమే సాధ్యం అని బహిరంగంగా తెలిసిన విషయమే.

BJP- Congress టాప్ లీడర్స్

BJP- Congress టాప్ లీడర్స్

యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేసిన ఎస్ఎం. కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక డీకే. శివకుమార్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని కేపీసీసీ అధ్యక్షుడి పదవిలో ఉన్నారు. ఇక మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ కుమార్తె మాళవికను కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ. సిద్దార్థ వివాహం చేసుకున్నారు. వీజీ. సిద్దార్థ, మాళవిక దంపతుల కుమారుడు అమాథ్య.

కాఫీ డే కింగ్ చివరి కోరిక !

కాఫీ డే కింగ్ చివరి కోరిక !

కాఫీ డే కింగ్ వీజీ. సిద్దార్థ, మాళవిక దంపతుల కుమారుడు అమాధ్య విదేశాల్లో చదువుకుని ప్రస్తుతం తండ్రి స్థాపించిన వ్యాపారాలను తల్లితో కలిసి చూసుకుంటున్నారు. గత సంవత్సరం వీజీ. సిద్దార్థ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు డీకే. శివకుమార్ ను కలిసి తన కుమారుడు అమాథ్య, మీ కుమార్తె ఐశ్వర్యకు పెళ్లి చెయ్యాలని మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నామని చెప్పారని తెలిసింది. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని ఆ రోజు డీకే. శివకుమార్ మాట ఇచ్చారని సమాచారం, ఈ చర్చలు జరిగిన మరుసటి రోజు కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ. సిద్దార్థ మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువు ఇంట్లో పెళ్లి చూపులు

గురువు ఇంట్లో పెళ్లి చూపులు

కాఫీ డే కింగ్ వీజీ. సిద్దార్థ, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మంచి స్నేహితులు. స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం కుమార్తె ఐశ్వర్యను సిద్దార్థ కుమారుడు అమాథ్యకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. బెంగళూరులోని సదాశివనగర్ లోని మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ ఇంటికి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు వెళ్లారు. డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులను ఇంట్లోకి ఆహ్వానించిన మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా పెళ్లి గురించి మాట్లాడుకుని తాంబూలాలు మార్చుకున్నారని వారి సన్నిహితులు తెలిపారు.

పార్టీలు ఏవైనా డోంట్ కేర్

పార్టీలు ఏవైనా డోంట్ కేర్

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తట్టుకోలేని మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ సోనియా గాంధీకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ గత లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన గురువు ఎస్ఎం. కృష్ణ బీజేపీలో చేరినా డీకే. శివకుమార్ మాత్రం ఆయన మాటను ఏరోజు జవదాటకుండా ప్రతినిత్యం ఆయనతో టచ్ లోనే ఉంటున్నారు. పార్టీలు ఏవైనా తాను ఎస్ఎం. కృష్ణ మనిషిని అంటూ డీకే. శివకుమార్ ఎవ్వరినీ కేర్ చెయ్యలేదు. ఎస్ఎం. కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాడో సీఎంగా డీకే. శివకుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం స్థాయిలో అప్పట్లో ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా ఎస్ఎం. కృష్ణ కచ్చితంగా డీకే. శివకుమార్ ను వెంట తీసుకెళ్లేవారు.

English summary
KPCC president DK Shivakumar's family visited SM Krishna residence at Sadashivnagar in Bengaluru. The auspicious Tamboola Shastra of Amartya Hegde and Aishwarya held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X