వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి రూ. 15 కోట్లు ఎర, అమ్ముడుపోయి ద్రోహం చేశాడు, ఎమ్మెల్యే మాత్రమే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసన సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి అమ్ముడుపోయారని, ప్రజలకు ద్రోహం చేశారని జేడీఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వ్యవహరించడానికి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వయంగా రూ. 15 కోట్లు ముడుపులు తీసుకుని మనకు ద్రోహం చేశారని బీజేపీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అమ్ముడు పోవడం వలనే బీజేపీ అభ్యర్థి విజయం సాధించారని జేడీఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!

మండ్య జిల్లా కేఆర్ పేట్

మండ్య జిల్లా కేఆర్ పేట్

కర్ణాటకలోని మండ్యలో జరిగిన జేడీఎస్ పార్టీ నాయకుల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు దినేష్ రాజాహుళి మాట్లాడారు. మండ్య జిల్లా జేడీఎస్ పార్టీ కంచుకోట అని ఆ పార్టీ నాయకుడు దినేష్ రాజాహుళి (రాజాపులి) గుర్తు చేశారు. మండ్య జిల్లాలోని కేఆర్ పేట్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లు సర్థుకుని ముడుపులు స్వీకరించారని జేడీఎస్ నేత దినేష్ రాజాహుళి ఆరోపించారు.

 కాంగ్రెస్ అభ్యర్థికి రూ. 15 కోట్లు ఎర ?

కాంగ్రెస్ అభ్యర్థికి రూ. 15 కోట్లు ఎర ?

కేఆర్ పేట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేబీ. చంద్రశేఖర్ పోటీ చేశారని జేడీఎస్ నాయకుడు దినేష్ రాజాహుళి గుర్తు చేశారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి, జేడీఎస్ పార్టీ అనర్హత ఎమ్మెల్యే నారాయణ గౌడ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీ. చంద్రశేఖర్ రూ. 15 కోట్లు ముడుపులు తీసుకుని పరోక్షంగా సహకరించారని దినేష్ రాజాహుళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి భారీ మెజారిటీ !

బీజేపీకి భారీ మెజారిటీ !

కేఆర్ పేట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీ. చంద్రశేఖర్ బీజేపీకి అమ్ముడు పోవడం వలనే అక్కడ బీజేపీ అభ్యర్థి నారాయణ గౌడ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారని జేడీఎస్ నాయకుడు దినేష్ రాజాహుళి ఆరోపించారు. అయితే ఈ విషయం కేఆర్ పేట్ నియోజక వర్గం ప్రజలకు తెలీదని జేడీఎస్ నాయకుడు దినేష్ రాజాహుళి అన్నారు.

జేడీఎస్ కు ద్రోహం చేశాడు

జేడీఎస్ కు ద్రోహం చేశాడు

గత శాసన సభ ఎన్నికల సమయంలో కేఆర్ పేట్ నుంచి జేడీఎస్ పార్టీ టిక్కెట్ తో నారాయణ గౌడ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తరువాత కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన నారాయణ గౌడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తరువాత అనర్హత ఎమ్మెల్యే నారాయణ గౌడ బీజేపీలో చేరారు.

పోరాడి ఓడిన జేడీఎస్

పోరాడి ఓడిన జేడీఎస్

కేఆర్ పేట్ లో జరిగిన శాసన సభ ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ తో పోటీ చేసిన నారాయణ గౌడ మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. నారాయణ గౌడ జేడీఎస్ కు ద్రోహం చేశారని ఆ పార్టీ నేత దినేష్ రాజాహుళి ఆరోపించారు. కేఆర్ పేట్ లో జేడీఎస్ ఓడిపోలేదని, మన పార్టీ కార్యకర్తలు బీజేపీ, కాంగ్రెస్ మీద పోరాటం చేసి తాత్కాలికంగా ఓడిపోయామని, వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ తన సత్తా చాటుకుంటుందని ఆ పార్టీ నేత దినేష్ రాజాహుళి ధీమా వ్యక్తం చేశారు.

English summary
Mandya JDS Talluk Panchayat member Dinesh Rajahuli alleged that KR Pate Congress candidate KB Chandrasekhar had received Rs 15 crore from BJP in By-Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X