బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక బంద్, ఊహించని మద్దతు: బెంగళూరులో బస్సులు, గోవా, మెట్రో రైలు, కన్నడ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Bandh at Bangalore : బెంగళూరు లో ప్రజల కష్టాలు, వీడియో

బెంగళూరు: మహాదాయి నదీ నీరు పంపిణి విషయంలో గోవా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిర్వహించిన కర్ణాటక బంద్ కు ఊహించని మద్దతు లభించింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యాసంస్థలు, వ్యాపారలావాదేవీలు పూర్తిగా స్థంభించాయి. కొన్ని ప్రయివేటు రవాణా సంస్థలు మినహా రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించింది.

బెంగళూరు సిటీ బస్సులు

బెంగళూరు సిటీ బస్సులు

కర్ణాటక బంద్ సందర్బంగా బెంగళూరు నగరంలో సంచరించే వేలాధి సిటీ బస్సులు (బీఎంటీసీ) పూర్తిగా స్థంభించాయి. బంద్ సందర్బంగా అధికారులు ఒక్క బీఎంటీసీ బస్సును డిపోల నుంచి బయటకు పంపించలేదు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కేఎస్ఆర్ టీసీ

కేఎస్ఆర్ టీసీ

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ఆర్ టీసీ బస్సు సేవలు 95 శాతం స్థంభించాయి. గురువారం ఉదయం కొన్ని కేఎస్ఆర్ టీసీ బస్సులు సంచరించినా కన్నడ సంఘాలు అడ్డుకోవడంతో ఆ సంస్థ అధికారులు బస్సులను డిపోలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తర కర్ణాటక

ఉత్తర కర్ణాటక


ఉత్తర కర్ణాటకలో బంద్ కు సంపూర్ణ మద్దతు లభించింది. వ్యాపారలావాదేవీలు, విద్యాసంస్థలు, ప్రయివేటు రవాణ సంస్థలు పూర్తిగా స్థంభించాయి. రోడ్లు మొత్తం నిశభ్దవాతావరణాన్ని తలపించాయి. కన్నడ సంఘాలు ర్యాలీలు నిర్వహించి గోవా, కేంద్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాయి.

నమ్మ మెట్రో రైలు

నమ్మ మెట్రో రైలు

కర్ణాటక బంద్ సందర్బంగా బెంగళూరు నగరంలో నమ్మ మెట్రో రైలు ఎప్పటిలాగే గురువారం సంచరించింది. అయితే ప్రయాణికుల సంఖ్య చాల తక్కువగా ఉంది. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగుతాయో అనే భయంతో బెంగళూరు ప్రజలు మెట్రో రైలులో సంచరించడానికి వెనకడుగు వేశారు.

అమిత్ షా టార్గెట్ !

అమిత్ షా టార్గెట్ !


గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను టార్గెట్ చేసుకుని గురువారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. మహాదాయి నదీ నీటి విడుదల విషయంలో గోవా సీఎం, అమిత్ షా రాజకీయం చేస్తున్నారని కన్నడ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

హుబ్బళి-దారవాడ !

హుబ్బళి-దారవాడ !

హుబ్బళి- దారవాడ జంట నగరాలు నిర్మాణుషంగా మారిపోయాయి. రోడ్ల మీద కన్నడ సంఘాలు తప్పా ప్రజలు ఎవ్వరూ కనపడలేదు. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

కన్నడ సంఘాల నేతలు అరెస్టు

కన్నడ సంఘాల నేతలు అరెస్టు


బెళగావి జిల్లాలోని బైలమంగల, కిత్తూరు, ఖానాపుర, రామదుర్గ, సవదత్తి ప్రాంతాల్లో కేఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులను గురువారం వేకువ జామున అడ్డుకున్న కన్నడ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు.

English summary
Karnataka Bandh on January 25 : What is closed, Which service is open?. KSRTC and BMTC employees forced to support Bandh. No holiday for government Schools, Colleges, Government employees. Then who is supporting the Bandh called by Vatal Nagaraj, Check this article to know moreFollowing the Karnataka bandh called by pro Kannada organizations on Thursday. KSRTC bus service has been intterupted in entire Belgaum district.Karnataka Bandh for Mahadayi : Several questions have no answers. The Karnataka bandh is against whom? Who will benefit from this bandhs and who will incur loss? Why Kannada organizations restrict their protest to few areas? Why Vatal Nagaraj doesn't protest in Delhi?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X