బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేగంగా వెలుతున్న ఆర్ టీసీ బస్సులో నుంచి కాలేజ్ అమ్మాయిని బయటకు తోసేసిన కండెక్టర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బస్సు పాస్ ను అనుమతించనని, టిక్కెట్ తీసుకోవాలని కాలేజ్ అమ్మాయితో గొడవ పెట్టుకున్న ఆర్ టీసీ కండెక్టర్ వేగంగా వెలుతున్న బస్సులో నుంచి ఆమెను కిందకు తోసేసిన దారుణ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఆర్ టీసీ బస్సులో నుంచి కండెక్టర్ బయటకు తోసేడంతో తీవ్రగాయాలైన కాలేజ్ విద్యార్థిని భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు అన్నారు.

బెంగళూరు నగరంలోని జ్యోతి కేంద్ర విద్యాలయంలో కనకపురలో నివాసం ఉంటున్న భూమిక అనే అమ్మాయి పీయూసీ (ఇంటర్) మొదటి సంవత్సరం చదువుతోంది. సాయంత్రం కాలేజ్పూర్తి అయిన తరువాత కనకపురలోని ఇంటికి వెళ్లడానికి భూమిక కేఎస్ఆర్ టీసీ బస్సు ఎక్కింది.

KSRTC bus conductor pushed a girl student from running bus in Bengaluru.

రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !

కేఎస్ఆర్ టీసీ బస్సు కండెక్టర్ టిక్కెట్ తీసుకోవాలని భూమికకు చెప్పాడు. తనకు బస్సు పాస్ ఉందని, టిక్కెట్ అవసరం లేదని భూమిక సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో తన బస్సులో కాలేజ్ బస్సు పాస్ లు అనుమతించనని, కచ్చితంగా టిక్కెట్ తీసుకోవాలని కండెక్టర్ కాలేజ్ అమ్మాయి భూమికతో గొడవ పెట్టుకున్నాడు.

బస్సు పాస్ ఎందుకు అనుమతించవని భూమిక కండెక్టర్ తో వాదించింది. ఆ సమయంలో తన బస్సులో తాను చెప్పిందే వేదం, నువ్వు టిక్కెట్ తీసుకుంటేనే నా బస్సులో రావాలని, లేదంటే కిందకు దిగాలని కండెక్టర్ రెచ్చిపోయాడు. తన దగ్గర టిక్కెట్ కు డబ్బులు లేవని, మార్గం మద్యలో బస్సు దిగితే చాలా దూరం నడవాలని, తరువాత వచ్చే బస్సు స్టాప్ లో దిగేస్తానని భూమిక మనవి చేసింది.

నమ్మిన కాంగ్రెస్ ను ముంచేస్తే నమ్ముకున్న బీజేపీ నట్టేట ముంచేసింది, బేగ్ కథ క్లోజ్, సైలెంట్!నమ్మిన కాంగ్రెస్ ను ముంచేస్తే నమ్ముకున్న బీజేపీ నట్టేట ముంచేసింది, బేగ్ కథ క్లోజ్, సైలెంట్!

ఇప్పుడే ఇక్కడే బస్సు దిగాలని కండెక్టర్ భూమికను హెచ్చరించాడు. మార్గం మద్యలో బస్సు దిగడానికి భూమిక నిరాకరించింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కండెక్టర్ వేగంగా వెలుతున్న బస్సులో నుంచి భూమికను బయటకు తోసేశాడు. భూమిక తల, ముఖం, ఎద, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

కాలేజ్ విద్యార్థిని బస్సులో నుంచి బయటకు తోసేసిన కండెక్టర్ కు అదే బస్సులోని ప్రయాణికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కండెక్టర్ ను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నామని కేఎస్ఆర్ టీసీ అధికారులు చెప్పారు. కాలేజ్ అమ్మాయిని బస్సులో నుంచి కిందకు తోసేసిన కండెక్టర్ పేరు బయటకు రాకుండా కేఎస్ఆర్ టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

English summary
Bebgaluru: KSRTC bus conductor pushed a girl student from running bus in Bengaluru. Girl got injured. conductor dismissed by KSRTC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X