బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక బంద్: ప్రభుత్వం, కేఎస్ఆర్ టీసీ మద్దతు: 23 వేల బస్సులు, మోడీ జోక్యం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అంతరాష్ట్ర నదీ జలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ మద్దతు తెలిపింది. గోవా ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న కన్నడిగులు జనవరి 25వ తేదీ గురువారం కర్ణాటక బంద్ కు పిలుపు నివ్వడంతో కేఎస్ఆర్ టీసీ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీటి పంపిణి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

23 వేల బస్సులు

23 వేల బస్సులు

జనవరి 25వ తేదీ గురువారం జరగనున్న కర్ణాటక బంద్ కు కేఎస్ఆర్ టీసీ సంస్థ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో దాదాపు 23,000 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. కేఎస్ఆర్ టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు బంద్ లో పాల్గొని ఉత్తర కన్నడ ప్రజల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.

మోడీ భేటీ రోజు బెంగళూరు బంద్

మోడీ భేటీ రోజు బెంగళూరు బంద్

గోవా ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 4వ తేదీన బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చారు. అయితే అదే రోజు ప్రధాని మోడీ పర్యటన ఉండటం కొసమెరుపు. ఆ కస్మికంగా బెంగళూరు బంద్, ప్రధాని మోడీ పర్యటన ఖరారు అయ్యాయి.

తీవ్ర ఇబ్బందులు

తీవ్ర ఇబ్బందులు

జనవరి 25వ తేదీన కేఎస్ఆర్ టీసీ బస్సు సంచారం పూర్తిగా నిలిచిపోతే ప్రయాణికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జనవరి 25వ తేదీ ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాలకు ఎవ్వరూ రాకూడదని కన్నడ సంఘాలు మనవి చేస్తున్నాయి.

గోవా- కర్ణాటక వార్

గోవా- కర్ణాటక వార్

గోవా- కర్ణాటక మధ్య మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గోవా ప్రభుత్వం మహాదాయి నదీ నీటిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తోంది. అయితే గోవా ప్రభుత్వం మాత్రం ఒక్క చుక్క నీరుకూడా వదిలి పెట్టమని తేల్చి చెబుతోంది.

ప్రధాని జోక్యం చేసుకోవాలి !

ప్రధాని జోక్యం చేసుకోవాలి !

హుబ్బళి-దారవాడతో సహ పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించడానికి మహాదాయి నదీ జలాలు ఇవ్వాలని, గోవాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కన్నడ సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

2 వేల సంఘాలు మద్దతు

2 వేల సంఘాలు మద్దతు

వాటల్ నాగరాజ్ ఆధ్వర్యంలో కన్నడ ఓక్కూట ఆధ్వర్యంలో జరుగుతున్న కర్ణాటక బంద్ కు దాదాపు 2, 000 కన్నడ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. గోవా ప్రభుత్వం మెడలు వంచి మహాదాయి నదీ జలాలు తెచ్చుకుంటామని కన్నడ సంఘాలు అంటున్నాయి.

డిసెంబర్ 27 బంద్

డిసెంబర్ 27 బంద్

మహాదాయి నదీజలాలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ గత డిసెంబర్ 27వ తేదీన ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాల్లో రైతు సంఘాలు బంద్ నిర్వహించారు. 20 రోజుల వ్యవదిలో కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపినిచ్చారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 25వ తేదీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

English summary
State-owned Karnataka State Road Transport Corporation (KSRTC) will support the called by Kannada organisations over the Mahadayi river issue. The general public would be severely affected by this as around 23,000 buses may go off-road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X