వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో మిగతా రాష్ట్రాలకంటే దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక మరో అడుగుముందుకు వేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పున:ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. నిజానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 7వేలకు చేరినా, రికార్డు స్థాయి రికవరీ రేటు(56.5)తో దాదాపు 4వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 86 మంది ప్రాణాలు కోల్పోగా, యాక్టివ్ కేసుల సంఖ్య మూడువేల లోపే కొనసాగుతోంది. ఈ దశలో బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సర్కారు నిర్ణయం తీసుకుంది.

17 నుంచి ఆంధ్రాకు..

17 నుంచి ఆంధ్రాకు..

నాలుగో దశ లాక్ డౌన్ లోనే బస్సు సర్వీసుల్ని పునరుద్ధరించేందుకు యడ్యూరప్ప సర్కారు ప్రయత్నించినా, మిగతా రాష్ట్రాలు ఆమేరకు సిద్ధంగా లేకపోవడంతో నిర్ణయాన్ని వాయిదావేసుకున్నారు. ఈలోపే ఆంధ్రప్రదేశ్ సర్కారు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఓకే చెప్పడంతో.. ఈనెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు నడుపుతామని ఏపీఎస్ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఆ మరుసటిరోజే.. కర్ణాటక ఆర్టీసీ సంస్థ సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. ఈ నెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు నడుపుతామని కేఎస్ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజనర్(ఆపరేషన్స్) సోమవారం ప్రకటన విడుదల చేశారు.

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి కర్ణాటకకు సర్వీసులు.. ఆన్ లైన్ లో టికెట్స్..ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి కర్ణాటకకు సర్వీసులు.. ఆన్ లైన్ లో టికెట్స్..

దశలవారీగా.. రిజర్వేషన్లు..

దశలవారీగా.. రిజర్వేషన్లు..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని సర్వీసుల్ని ఒకేసారి కాకుండా దశల వారీగా పునరుద్ధరిస్తామని కేఎస్ఆర్టీసీ తెలిపింది. కర్ణాటకలోని కీలక పాయింట్ల నుంచి ఏపీలోని పలు ఊర్లకు ఈనెల 17 నుంచి నడపబోయే సర్వీసుల వివరాలను విడుదల చేశారు. అలాగే ఆయా సర్వీసుల్లో టికెట్లకు సంబంధించి సోమవారం నుంచే ఆన్ లైన్ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, http://www.ksrtc.in వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్లు పొందొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అదే ఏపీ వైపు నుంచి.. తొలిదశలో 168 బస్సులు, 4 దశ నాటికి 500బస్సులు నడుపుతామని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

సుశాంత్ ఆత్మహత్య కాదు చంపేశారు.. సీబీఐ ఎంక్వైరీకి ఫ్యామిలీ డిమాండ్.. ఆ డాక్టర్ నుంచి స్టేట్మెంట్..సుశాంత్ ఆత్మహత్య కాదు చంపేశారు.. సీబీఐ ఎంక్వైరీకి ఫ్యామిలీ డిమాండ్.. ఆ డాక్టర్ నుంచి స్టేట్మెంట్..

ఇవీ సర్వీసుల వివరాలు..

ఇవీ సర్వీసుల వివరాలు..


ఈనెల 17 నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుతోపాటు మూడు కీలక పాయింట్ల నుంచి బస్సులు ప్రారంభంకానున్నాయి. వాటి వివరాలివి.. బెంగళూరు నుంచి అనంతపురం, హిందూపూర్, కదిరి, పుట్టపర్తి, కల్యాణదుర్గం, రాయదుర్గం, కడప, ప్రొద్దుటూరు, మంత్రాలయం, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, నెల్లూరు, విజయవాడలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, బళ్ళారి నుంచి విజయవాడ, అనంతపురం, కర్నూలు, మంత్రాలయంకు, రాయచూర్ నుంచి మంత్రాలయానికి, షాపూర్ నుంచి మంత్రాలయం, కర్నూలు వరకు సర్వీసులు నడపనున్నట్లు కేఎస్ఆర్టీసీ తెలిపింది.

Recommended Video

Karnataka Bandh On Feb 13th : Jobs For Kannadigas | What Will Be Open And Shut?
పకడ్బందీ చర్యలు..

పకడ్బందీ చర్యలు..

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో కర్ణాటక, ఏపీ రవాణా సంస్థలు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాయి. బస్సుల్లో శానిటైజేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ, క్రిమి సంహారక మందుల్ని స్ప్రేయింగ్ చేస్తామని, ప్రయాణికులకు థర్మల్ స్ట్రీనింగ్స్ చేపడతామని సంస్థలు తెలిపాయి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.

English summary
Karnataka State Road Transport Corporations will resume operations to Andhra Pradesh in a phased manner with effect from June 17, like same way apsrtc also resuming operations to karnataka from 17th itself
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X