వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు చెంపపెట్టు: కులభూషణ్ జాదవ్‌ మరణశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే

|
Google Oneindia TeluguNews

దిహేగ్: అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించగా.. అంతర్జాతీయ న్యాయస్థానం దానిపై స్టే విధించింది. తుది తీర్పు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పటి వరకు జాదవ్ ఉరిశిక్షను అమలు చేయవద్దని తేల్చి చెప్పింది.

ఎవరీ కులభూషణ్?: 'పాకిస్తాన్ ఉరిశిక్షపై గట్టిగా స్పందించాలి' ఎవరీ కులభూషణ్?: 'పాకిస్తాన్ ఉరిశిక్షపై గట్టిగా స్పందించాలి'

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తీర్పు పాఠాన్ని న్యాయమూర్తి రోనీ అబ్రహం చదివారు. తీర్పును 11మంది న్యాయమూర్తుల బృందం ప్రకటించింది.

జాద‌వ్ కేసును అంతర్జాతీయ కోర్టులో రూ. 1కే వాదిస్తున్న‌ హ‌రీశ్ సాల్వేజాద‌వ్ కేసును అంతర్జాతీయ కోర్టులో రూ. 1కే వాదిస్తున్న‌ హ‌రీశ్ సాల్వే

భారత్, పాకిస్థాన్‌లు వియన్నా ఒప్పందంలో భాగస్వాములని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇరు దేశాలు వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోర్టు పేర్కొంది. దీనిపై పాక్ అభ్యంతరాలను తోసిపుచ్చారు. జాదవ్ ను కలుసుకునే హక్కు భారత్‌కు ఉందని కోర్టు తేల్చి చెప్పింది. భారత దౌత్య అధికారులకు జాదవ్‌ను కలుసుకునే అవకాశం కల్పించాలని తెలిపింది.

భారత్‌కు వ్యతిరేకంగానే: కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్షపై అమెరికా నిపుణులు భారత్‌కు వ్యతిరేకంగానే: కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్షపై అమెరికా నిపుణులు

కేసు ఐసీజే పరిధిలోకి రాదన్న పాక్ వాదననూ కోర్టు తప్పుపట్టింది. జాదవ్ కేసును విచారించే పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని స్పష్టం చేసింది. దౌత్యపరమైన సహాయం అంశంలో పాక్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం తేల్చి చెప్పింది. పాక్ తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

పాక్‌కి షాక్: కులభూషణ్ మరణశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే, భారత్ హర్షం పాక్‌కి షాక్: కులభూషణ్ మరణశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే, భారత్ హర్షం

అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో భారత్ విజయం సాధించినట్లయిందని అన్నారు.
అంతర్జాతీయ సమాజంలో మరోసారి దోషిగా పాకిస్థాన్ నిలబడింది. 18ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ మరోసారి గెలిచింది. దీంతో ప్రపంచం ముందు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) సాక్షిగా పాకిస్థాన్ కుట్ర బట్టబయలైంది. కాగా, భారత్ తరపున హరీశ్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

Kulbhushan Jadhav: ICJ verdict today

అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భారత్

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయ‌న‌పై గూఢ‌చారి అనే ముద్రవేయ‌డం ప‌ట్ల భార‌త్ ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. అంతేగాక, భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇటీవలే జాదవ్ మరణశిక్షపై స్టే ఇచ్చిన అంతర్జాతీయ న్యాయస్థానం.. గురువారం తుది తీర్పుున వెలువరించింది.

చారిత్రక విజయం: మోడీ హర్షం

అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌కు ఇది చారిత్ర విజయమని విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.

English summary
The International Court of Justice will pronounce it verdict in the Kulbhushan Jadhav case on Thursday at 3.30 pm. The ICJ at The Hague had reserved orders earlier this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X