• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘ఆప్’ సంక్షోభం : దిగొచ్చిన కేజ్రీవాల్.. షరతులకూ అంగీకారం.. కుమార్ కు రాజస్థాన్ వ్యవహారాలు

By Ramesh Babu
|

న్యూఢిల్లీ : తన వ్యతిరేకుల విషయంలో ఎప్పుడూ ఫైర్‌బ్రాండ్ కామెంట్లు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు దిగొచ్చారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, తనకు అత్యంత సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్‌ను వదులుకోడానికి ఇష్టపడక.. ఆయన పెట్టిన షరతులకు తలొగ్గారు.

కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి ఇంతకాలం తనకు ఏ మాత్రం అలవాటు లేని రాజీ ధోరణిలోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద కుమార్ విశ్వాస్ బహిరంగంగా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

కుమార్ విశ్వాస్ పెట్టిన షరతులను కూడా కేజ్రీవాల్ ఆమోదించారు. అందుకే చర్చల తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బయటకు వచ్చి.. కుమార్ విశ్వాస్ పార్టీలోనే కొనసాగుతారని, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉంటారని ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లయింది.

‘‘30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..''

‘‘30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..''

ఈ నేపథ్యంలో .. కుమార్ విశ్వాస్ బీజేపీ, ఆరెస్సెస్ లతో కలిసిపోయారని, అందుకే అలా మాట్లాడుతున్నారని పీఏసీ సభ్యుడు అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో పాటు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఆయన బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారని, అందుకు ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ముట్టజెబుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.

‘‘ఎవరిలా మాట్లాడిస్తున్నారో కూడా తెలుసు..''

‘‘ఎవరిలా మాట్లాడిస్తున్నారో కూడా తెలుసు..''

దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. అమానతుల్లా ఖాన్ ముసుగులో ఎవరు ఈ మాటలు మాట్లాడిస్తున్నారో కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వం మీద కుమార్ విశ్వాస్ విమర్శలు గుప్పించారు.

తొలిసారి ఒక మెట్టు దిగిన కేజ్రీవాల్..

తొలిసారి ఒక మెట్టు దిగిన కేజ్రీవాల్..

తాను మోనార్క్‌నని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఎప్పుడూ మండిపడుతుండే అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా ఒక నాయకుడి విషయంలో మాత్రం తలవంచారు. ఎందుకంటే.. పార్టీ వ్యవస్థాపకులలో కుమార్ విశ్వాస్ కూడా ఒకరు. ఆయన పార్టీ కోసం పోస్టర్లు అతికించిన స్థాయి నుంచి వచ్చారు. అవినీతి మరకలు ఏమాత్రం అంటని వ్యక్తి. దానికితోడు క్షేత్రస్థాయిలో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది.

వ్యాట్ బాదుడుపై టీడీపీ ఫైర్

వ్యాట్ బాదుడుపై టీడీపీ ఫైర్

లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని జగన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రూ. 1.24, లీటర్ డీజిల్ పై 0.93 పైసలు వ్యాట్ పెంచింది. దీనిని ప్రతిపక్ష టీడీపీ తప్పుపట్టింది. క్లాస్ ఫస్ట్ రావాలంటే ఎం చెయ్యాలి అన్నాడు బాబు, మిగతావాళ్ళు పరీక్ష రాయకుండా చేయాలని అన్నారు. మద్యపాన నిషేధం చెయాలంటే మద్యం రేట్లు పెంచాలి, కరోనా సమయంలో ప్రజలు బయట తిరగకూడదంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాలని.. అలాగే పెంచేశారని అనిత ఎద్దేవా చేశారు.

రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా..

రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా..

అందుకే ‘పార్టీలో కొనసాగాలంటే..' అంటూ కుమార్ విశ్వాస్ పెట్టిన షరతులను కూడా ఆమోదించారు. అందుకే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చర్చల తర్వాత బయటకు వచ్చి.. కుమార్ విశ్వాస్ పార్టీలోనే కొనసాగుతారని, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉంటారని ప్రకటించారు.

English summary
NEW DELHI: As Aam Aadmi Party battled a major internal crisis with speculation that senior leader Kumar Vishwas was on the verge of quitting over allegations made by MLA Amanatullah Khan, party chief Arvind Kejriwal met the upset leader late on Tuesday night in a last-ditch attempt at rapprochement ."Kumar is upset, but I am sure we will convince him. He is an integral part of our movement," Kejriwal said after emerging from the meeting. Earlier in the day , Kumar Vishwas had defied Kejriwal's direction not to make public remarks. In an emotional statement at an impromptu press conference outside his Ghaziabad house, he said that if Khan had made allegations against Kejriwal or Manish Sisodia, he would have been expelled from the party in no time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more