వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీకి షాక్: కుమార్ విశ్వాస్ సహా ఏడుగురు ఎమ్మెల్యేలపై ఫోర్జరీ కేసు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలపై ఫోర్జరీ కేసు దాఖలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కుమార్ విశ్వాస్ కూడా ఉన్నారు.

 Kumar Vishwas, seven AAP MLAs booked for forgery

కాగా, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు రాహుల్ శర్మ ఈ కేసును దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో వీరు వాస్తవాలను దాచిపెట్టారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలు కొన్ని కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారని, వివిధ కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయని, ఈ అంశాలను వీరు వెల్లడించలేదని ఆరోపించారు.

ఇది ఇలావుంటే.. కుమార్ విశ్వాస్ రాజ్యసభసభ్యత్వాన్ని ఆశించారు. అయితే, విశ్వాస్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌.. రాజకీయాలకు అతీతంగా ఉన్నవారికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో కుమార్ విశ్వాస్ ఆశలు అడియాసలయ్యాయి.

English summary
A case of forgery has been registered against eight Aam Aadmi Party (AAP) leaders, including Kumar Vishwas, for concealing the details of their assets from the Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X