వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి మృతి కేసులో కొత్త ట్విస్ట్, ఆమె తెలుగు వనిత: కుమారస్వామి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఎఎస్ అధికారి డికె రవి మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఓ మహిళా ఐఎఎస్ అధికారికీ, రవికీ మధ్య సంబంధం అంటగడుతూ ఓ వార్తాకథనం వచ్చింది. డీకే రవి ఆత్మహత్య చేసుకున్న రోజే ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి 44 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరణానికి ముందు రవి ఆమెకు కొన్ని మెస్సేజ్‌లను కూడా పంపినట్లు ప్రచారం సాగుతోంది

సదరు అధికారిణి రవికి 2009 బ్యాచ్‌మేట్ కూడా. ఓ పాపకు తల్లి కూడా అయిన ఆమె దక్షిణ కర్నాటకలో పని చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన రాజకీయ నాయకుడు హనుమంతరాయప్ప కూతురు కసుమను వివాహం చేసుకోక ముందు ఐఏఎస్ అధికారిణి, రవి మంచి స్నేహితులని తెలిసింది. అదే మహిళను ఉద్ధేశించి రవి ఫేస్‌బుక్ పేజీలో కొన్ని పోస్టులు కూడా ఉన్నాయని ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక పేర్కొంది. అయితే, ఆ వార్తాకథనాలను, ఆ ప్రచారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

ఆ మహిళా ఐఎఎస్ అధికారి తెలుగు ప్రాంతానికి చెందినప్పటికీ కర్ణాటక క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఐఎఎస్ అధికారిగా ఆమె రవికి చెందిన సొంత జిల్లా తుంకూరులో తొలి బాధ్యతలు చేపట్టారని దక్కన్ క్రానికల్‌ వార్తాకథనంలో వచ్చింది. కుసుమ పట్ల రవి అసంతృప్తిగా ఉండేవారని కూడా ప్రచారం సాగుతోంది.

ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృ తి కేసును దర్యాప్తు పక్కదోవ పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ శాసనసభా పక్ష నేత హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.

Kumaraswami lashes out at Sidharamaiah on Ravi death case

ఐఏఎస్ అధికారి రవి కేసును మూసెయ్యడానికి సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 2009లో రవి ఐఎస్ఐ అధికారి అయ్యారని గుర్తు చేశారు. అదే బ్యాచ్ కు చెందిన ఒక మహిళ ఐఏఎస్ అధికారి రవి మంచి స్నేహితులు అన్నారు. ఇప్పుడు ఆమెను బెదిరించి రవి మీద లేనిపోని ఆరోపణలు చెయ్యడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని మండిపడ్డారు.

రవి మరణించిన రోజు సోమవారం 10 నిమిషాలలో 44 సార్లు మహిళ ఐఏఎస్ అధికారికి రవి ఫోన్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తు అధికారుల దగ్గర ఆ మాటలు చెప్పిస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. 10 నిమిషాలలో 44 సార్లు ఫోన్ చెయ్యడం సాధ్యం అవుతుందా అని కుమారస్వామి ప్రశ్నించారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని నిజాయితీ గల ఐఏఎస్ అధికారికి అన్యాయం చెయ్యాలని చూస్తే సహించమని కుమార స్వామి హెచ్చరించారు.

అయితే మీడియాలో మాత్రం రవి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్న అధికారుల తీరు చూసి ఆయన కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రవి స్నేహితురాలికి ఇంతకు ముందే సాఫ్ట్ వేర్ రంగంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తితో వివాహం అయ్యిందని, ఒక బిడ్డ ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి.

భర్తకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకోవాలని రవి ఆమె మీద ఒత్తిడి చేశారని ఒక సీనియర్ అధికారి అంటున్నారు. రెండవ పెళ్లి చేసుకుంటే వరకట్నం వేధింపుల కేసు పెడుతానని రవి భార్య కుసుమ రవిని హెచ్చరించారని ఆ అధికారి అంటున్నారు.

English summary
Five days after his death at his official residence in South Bengaluru, various information about DK Ravi's personal affair have been revealed. In between, demand for CBI inquiry is gaining strength day by day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X