వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాలా’ను అనుమతించలేం, అలా చేస్తేనే మంచిది: సీఎం కుమారస్వామి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' చిత్రం కర్ణాటకలో విడుదలయ్యేందుకు కష్టాలు వీడటం లేదు. తాజాగా, కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు.

కావేరీ జలాల విషయం తేలేదాకా కాలా సినిమాను అనుమతించమని కుమారస్వామి అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా, సాధారణ పౌరుడిగా, సగటు కన్నడ వ్యక్తిగా చేస్తున్నానని అన్నారు.

kumaraswamy comments kaala release in karnataka

కాలా సినిమాను ఇప్పుడు విడుదల చేయడం నిర్మాతలకు శ్రేయస్కరం కాదని, వారు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని కుమారస్వామి అన్నారు. తాను కూడా ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశానని గుర్తు చేశారు.

కావేరీ జలాల వివాదం సద్దుమణిగిన అనంతరం విడుదల చేస్తే బాగుంటుందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కన్నడ ఫిల్మ్ చాంబర్, కన్నడ ఆర్గనైజేషన్లు సైతం 'కాలా' విడుదలను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు.

English summary
On the day that the Karnataka High Court ordered the state government to provide security to theatres that screen Kaala, Karnataka Chief Minister HD Kumaraswamy said that as a Kannadiga, he would not advocate releasing the Rajinikanth-starrer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X