వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా కర్నాటకీయం: సభను శుక్రవారంకు వాయిదా వేసిన స్పీకర్..యడ్యూరప్ప నిరసన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజకీయాల్లో నేడు కీలక ఘటన చోటుచేసుకోనుంది. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కుమారస్వామి సర్కార్ సంక్షోభంలో పడిపోయిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైంది. తమ ప్రభుత్వంకు వచ్చిన ఢోకా ఏమీ లేదని చెబుతున్నప్పటికీ .... వాస్తవ పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా లేదు.

మరో వైపు ప్రతిపక్ష బీజేపీ మాత్రం ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోందనే ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వారు బలపరీక్షకు హాజరు కారని తెలుస్తోంది.సభలో సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య 117గా ఉంది. కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37, బీఎస్పీ ఒక స్థానం ఉన్నాయి.

Kumaraswamy govt to face Crucial trust vote  live updates

ఇక నామినేటెడ్ అభ్యర్థి కూడా ఒకరున్నారు. ఇక బీజేపీకి సంఖ్యాబలం 105 ఉండగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉండటంతో బీజేపీ సంఖ్యాబలం 107కు చేరుకుంది. ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు కనుక స్పీకర్ ఆమోదిస్తే వారు సభలో ఉండే అవకాశం లేదు . దీంతో సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య 101 పడిపోతుంది.

Newest First Oldest First
6:36 PM, 18 Jul

సభలో బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు
6:35 PM, 18 Jul

బలపరీక్ష నిర్వహించకుంటే మా ఎమ్మెల్యేలు ఇక్కడే నిద్రపోతారు: యడ్యూరప్ప
6:34 PM, 18 Jul

బలపరీక్ష నిర్వహించాలని పట్టుబడుతున్న యడ్యూరప్ప
6:27 PM, 18 Jul

సభలోనే ఉండి నిరసన తెలుపుతున్న యడ్యూరప్ప
6:27 PM, 18 Jul

విశ్వాసపరీక్షను రేపటికి వాయిదా వేసిన స్పీకర్
6:26 PM, 18 Jul

కర్నాటకం: అసెంబ్లీ రేపటికి వాయిదా వేసిన స్పీకర్
6:13 PM, 18 Jul

అర్థరాత్రి అయినా ఫర్వాలేదు.. ఈరోజే బలపరీక్షను పూర్తి చేయండి: యడ్యూరప్ప
6:09 PM, 18 Jul

ఎమ్మెల్యే పాటిల్‌ ఫోటోతో అసెంబ్లీలో నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
5:20 PM, 18 Jul

బలపరీక్ష ఈ రోజే పూర్తిచేయాలని గవర్నర్ స్పీకర్‌కు సూచన
5:20 PM, 18 Jul

స్పీకర్‌ను కలిసిన గవర్నర్ కార్యాలయం అధికారులు
3:42 PM, 18 Jul

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సరైన రూపంలో రాజీనామా చేయలేదు
3:38 PM, 18 Jul

రిసార్ట్‌లో ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆస్పత్రిలో ఎలా చేరారు: డీకే శివకుమార్
3:35 PM, 18 Jul

ఎమ్మెల్యే పాటిల్‌ను ఇండిగో విమానంలో ముంబైకి తరలించారు: కుమారస్వామి
3:35 PM, 18 Jul

మా ఎమ్మెల్యేలను మీరు తరలించారు
3:28 PM, 18 Jul

భోజన విరామం తర్వాత ప్రారంభమైన సభ.. సభలో నెలకొన్న గందరగోళ వాతావరణం
3:17 PM, 18 Jul

బలపరీక్షలో పాల్గొనేందుకు విధానసౌధకు చేరుకున్న కర్నాటక మంత్రి రేవన్న గౌడ
3:13 PM, 18 Jul

గవర్నర్‌ను కలిసే యోచనలో బీజేపీ.. కాంగ్రెస్ జాప్యంపై ఫిర్యాదు చేయనున్న కమలనాథులు
2:49 PM, 18 Jul

భోజన విరామం కోసం అసెంబ్లీ 3 గంటల వరకు వాయిదా
2:45 PM, 18 Jul

బలపరీక్ష ఈ రోజే పూర్తి కావాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ... కాంగ్రెస్ కావాలనే జాప్యం చేస్తూ తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆగ్రహం
2:35 PM, 18 Jul

కాంగ్రెస్ కావాలనే బలపరీక్షను వాయిదా వేయాలని చూస్తోంది: బీజేపీ
2:34 PM, 18 Jul

బలపరీక్షను వాయిదా వేయాలని కోరిన సిద్ధరామయ్య
2:34 PM, 18 Jul

సుప్రీంకోర్టు గందరగోళానికి గురిచేస్తోంది. స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న సిద్ధరామయ్య
2:33 PM, 18 Jul

మాటా-మంతీ

కర్నాటకంలో ఆసక్తికర ఘటన. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములును కలిసిన మంత్రి డీకేశివకుమార్
1:36 PM, 18 Jul

సభకు గైర్హాజరైన ఎమ్మెల్యేలు వీరే
1:29 PM, 18 Jul

బలపరీక్ష పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సభకు గైర్హాజరైన 20 మంది ఎమ్మెల్యేలు
12:30 PM, 18 Jul

సభకు గైర్హాజరైన మొత్తం ఎమ్మేలల సంఖ్య 19
12:25 PM, 18 Jul

ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకుందన్న సిద్ధరామయ్య
12:24 PM, 18 Jul

బలపరీక్షను ఒకే రోజులో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసిన యడ్యూరప్ప
12:22 PM, 18 Jul

రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అనారోగ్యంతో ముంబై హాస్పిటల్‌లో చేరిక
12:20 PM, 18 Jul

సభకు హాజరుకానీ బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్.. తమ అధినేత్రి మాయావతిని కాంగ్రెస్ జేడీఎస్‌ వారు కలవలేదన్న మహేష్
READ MORE

English summary
Ahead of the crucial trust vote today, the Congress-JD(S) government in Karnataka hangs by a thread after the Supreme Court on Wednesday held that the 15 rebel MLAs cannot be compelled to participate in the proceedings of the Assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X