వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా నడిపిస్తోంది.. కుమారస్వామి సంచలన ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సీఎం కుమారస్వామి ప్రసంగంలో కీలక అంశాలను లేవనెత్తారు. తన 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన అంశాలను ప్రస్తావిస్తూనే .. విపక్ష బీజేపీని గట్టిగా ఎండగడుతున్నారు. అధికారం కోసం బీజేపీ ఆరాటపడుతుందని .. అందుకే ఎమ్మెల్యేల చేత క్యాంప్ వేయించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా వైఖరిని కూడా ప్రస్తావించారు కుమారస్వామి.

కర్ణాటక ప్రజలు నన్ను క్షమించాలి... నాకు సీఎం పదవి అవసరం లేదు... సభలో కుమారస్వామి కర్ణాటక ప్రజలు నన్ను క్షమించాలి... నాకు సీఎం పదవి అవసరం లేదు... సభలో కుమారస్వామి

కీ రోల్

కీ రోల్

దేశంలో అన్ని వ్యవస్థల కన్నా మీడియా కీ రోల్ పోషిస్తుందన్నారు కుమారస్వామి. పోర్త్ ఎస్టేట్‌గా భావిస్తోన్న మీడియా దేశాన్ని శాసిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా దేశంలో జరిగే పరిణామాలను క్షణకాలంలో తెలుపుతూ .. దేశాన్ని నడిపిస్తోందన్నారు. అయితే ఇందులో మంచి కన్నా చెడే ఎక్కువ ఉందనే అర్థం ఇచ్చేలా కౌంటర్ అటాక్ చేశారు. ఒక్క అంశాన్ని పట్టుకొని .. నిబద్ధత లేకుండా చర్చించి .. ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని సునిశీతంగా విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలకు అసలు విషయం కన్నా కొసరు విషయం తెలుస్తుందన్నారు. దీంతో దేశానికి కీడే తప్ప మేలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు.

శాశ్వతం కాదు

శాశ్వతం కాదు

దేశంలో ఏ సీఎం శాశ్వతం కాదని వేదాంతం చెప్పారు. ఐదేళ్లకొసారి ఎన్నికలు జరుగుతాయి .. మెజార్టీ సాధించిన పార్టీ అధికారం చేపడుతుందని వివరించారు. కానీ తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. కానీ కొన్ని చానెళ్లు మాత్రం తను బిర్యానీ తిన్నానని వార్తలు ప్రచారం చేసి .. టీఆర్పీ రేటింగులు తెచ్చుకున్నాయని మండిపడ్డారు. ఇది తగునా అని ఆయన సభాముఖంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియాకు తాను ఒక్కటి చెప్పదల్చుకున్నానని వివరించారు. ఇక చాలు .. మీరు ఈ దేశాన్ని నడుపాల్సిన అవసరం లేదు అని స్పష్టంచేశారు.

3 సీట్ల దూరంలో ..

3 సీట్ల దూరంలో ..

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా .. 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరేశారు. వారు ముంబైలో క్యాంపులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్ష బీజేపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ నిర్వహించి .. సభలో మెజార్టీ గురించి వివరిస్తారు. ఇవాళ సభకు 205 మంది సభ్యులు హాజరయ్యారు. 103 ఎమ్మెల్యేల మద్దతు మ్యాజిక్ ఫిగర్. అయితే అధికార కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి 100 సభ్యుల బలం ఉంది. అంటే మెజార్టీ 3 సీట్ల దూరంలో ఉంది కుమారస్వామి సర్కార్. విపక్ష బీజేపీ మాత్రం 105 సీట్లతో అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. సభలో కుమారస్వామి మెజార్టీ నిరూపించుకోకుంటే .. గవర్పనర్ వద్దకెళ్లి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు గవర్నర్ వాజుభాయ్ వాలా .. తన విచక్షణతో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరతారు.

English summary
CM HD Kumaraswamy Says electronic Media is Ruining The Country | "This CM position isn't permanent. Don't mistake me. Some channel was discussing about the biryani story around IMA case. I am telling the electronic media, don't ruin this country," says Kumaraswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X