వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐది కుంభకర్ణుడి నిద్ర: ఐదు రోజుల సిబిఐ కస్టడీకి కార్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

INX Media Case : Karti Chidambaram in CBI Custody | Oneindia Telugu

న్యూఢిల్లీ: సిబిఐ కుంభకర్ణుడి నిద్రపోతోందని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తి చిదంబరం అన్నారు. ఆయనను కోర్టు ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. కార్తి చిదంబరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దాన్ని కోర్టు తిరస్కరించింది.

కార్తి చిదంబరాన్ని రెండు వారాల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరగా కోర్టు ఆరు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ నెల 6వ తేదీ వరకు పాటియాలా హౌస్ కోర్టు ఆయనను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అర్థ సత్యాలతో కోర్టును తప్పు దోవ పట్టించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని కార్తి చిదంబరం తరఫున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ అన్నారు.

నిరుడు ఆగస్టులో కార్తి చిదంబరాన్ని ప్రశ్నించారని, ఆరు నెలల పాటు విరామం తీసుకున్నారని, ఇప్పుడు సహకరించడం లేదనే కారణంతో అరెస్టు చేశారని, ఆరు నెలల పాటు సిబిఐ కుంభకర్ణుడి నిద్రపోయిందా అని అన్నారు.

చెస్ మేనేజ్‌మెంట్, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ - రెండు కంపెనీలపై సాక్ష్యాలు లభించాయని, చెస్ మేనేజ్‌మెంట్‌ను కార్తి చిదంబరం నిర్వహిస్తున్నాడని అదనపు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

English summary
Pointing to the six-month gap between the questioning of Karti Chidambaram, which took place in August last year, and the CBI action yesterday, Abhishel Singhvi said, "There is no allegation of non-cooperation for six months yet still the sudden arrest".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X