వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను ఎందుకు నిషేధించలేదు, కునాల్ కామ్రాకే ఎందుకు..? నెటిజన్ల ప్రశ్న

|
Google Oneindia TeluguNews

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గో స్వామిని విమానంలో ఎగతాళి చేసిన కమెడియన్‌ను ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్ విమానాల్లో నిషేధించాయి. ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉంటుందని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక్క కునాల్ కామ్రాపైనే ఎందుకు బ్యాన్ అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై ఎందుకు నిషేధం వద్దు అని అడుగుతున్నారు.

అందరికీ ఒకేలా ఉండాలి కదా..?

అందరికీ ఒకేలా ఉండాలి కదా..?


తప్పుచేస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. ఒక్క కునాల్ కామ్రాపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ట్రోల్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఘటనను గుర్తుచేస్తున్నారు. ఢిల్లీ-భోపాల్ విమానంలో ప్రయాణిస్తోన్న బీజేపీ ఎంపీ తన సీటు మార్చుకొనేందుకు నిరాకరించారు. దీంతో విమానం నిర్ణిత సమయం కన్నా 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన సంగతి తెలిసిందే.

స్పై‌స్‌జెట్ ఎంటీ వివక్ష..

స్పై‌స్‌జెట్ ఎంటీ వివక్ష..

ఆ సమయంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించారు. మీ విమానంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ రచ్చ చేస్తే సస్పెండ్ చేశారా..? లేదే..? మరి కునాల్ కామ్రాపై ఎందుకు ఇలా వ్యవహరించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కునాల్ కామ్రాతోపాటు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై కూడా నిషేధం విధించాలని కోరుతున్నారు. ఆ సమయంలో ఇతర ప్రయాణికులకు బీజేపీ ఎంపీ ఇబ్బంది కలుగజేశారని ప్రశ్నించారు. విమానం ఆలస్యమైనందుకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై చర్యలు తీసుకున్నారా..? ఆమెపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా టాంగెవాలా అసోసియేషన్ విమానయాన సంస్థలను ప్రశ్నించింది.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..


ఇటీవల ముంబై-లక్నో ఇండిగో విమానంలో కునాల్ కామ్రా వెళ్తున్నారు. పక్క సీటులో ఉన్న అర్నాబ్ గోస్వామిని.. కునాల్ కామ్రా ఎగతాళి చేశారు. టీవీ చర్చల్లో గో స్వామి ఎలా ప్రవర్తిస్తారో అలా బీహేవ్ చేశారు. దీనంతటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో అది వైరలవడంతో... విమానయాన సంస్థలు స్పందించాయి. ఇండిగో మొదట తమ విమానాల్లో కునాల్‌పై నిషేధం విధించాయి. తర్వాత ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్ కూడా బ్యాన్ చేశాయి. దీంతో నెటిజన్లు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆమెను ఎందుకు బ్యాన్ చేయరని ప్రశ్నిస్తున్నారు.

English summary
internet has called out the hypocrisy of airlines after comedian Kunal Kamra was banned by four carriers.. But why was such action not taken against BJP MP Pragya Singh Thakur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X