వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్వారా గ్యాంగ్ రేప్, హత్య: నలుగురికి మరణ శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు కోర్టు శుక్రవారంనాడు మరణశిక్ష విధించింది. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా 13 ఏళ్ల అమ్మాయిపై 2007లోల నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు.

ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిణగిస్తూ దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు మొదటి నుంచీ కోరుతున్నారు. నిందితులు సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ లాంగాటే ప్రాంతానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు జహంగీర్ అన్సారీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. మరో నిందితుడు సురేష్ కుమార్ రాజస్థాన్‌కు చెందినవాడు.

 Kupwara rape and murder case: Court awards death sentence to all 4 convicts

నలుగురు నిందితులను కూడా కోర్టు ఏప్రిల్ 18వ తేదీన దోషులుగా నిర్ధారించింది. ఆ అమ్మాయి హత్యోదంతం కాశ్మీర్ లోయలో తీవ్ర సంచలనం సృష్టించింది. పెద్ద యెత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగాయి.

నలుగురు కూడా 2007 ఆగస్టు నుంచి జైలులోనే ఉన్నారు. కోర్టు 86 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఆ 13 ఏళ్ల బాలిక పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకాన్ని నెలకొల్పింది.

English summary
In what may bring some sense of closure to the family of school girl Tabinda Ghani who was brutally raped and murdered in 2007, a local court, Friday, sentenced all the four convicted in the case to death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X