వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షమైనా..: స్మృతి ఇరానీకి నటి ఖుష్బూ బాసట

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి డిఎంకె మహిళా నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్భూ మద్దతుగా నిలిచారు. స్మృతి ఇరానీ విద్యార్హత పైన పలువురు కాంగ్రెసు నేతలు ప్రశ్నలు కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఖుష్బూ ట్విట్టర్‌లో స్పందించారు. ఎవరికైనా వ్యక్తిగత ప్రతిభ ముఖ్యం కాని... చదువు కాదని ఆమె ట్వీట్ చేశారు.

స్మృతి ఇరానీకి జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. పౌర విమానయానం చేపట్టాలంటే పైలట్ కోర్స్ చేయనవసరం లేదు కదా, బొగ్గు శాఖను నిర్వహంచాలంటే గనుల్లో తవ్వాల్సిన అవసరం లేదు కదా అని ఆయన ఎద్దేవా చేశారు.

కాగా, తనపై వస్తున్న విమర్శలకు స్మృతి ఇరానీ గురువారం ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు నేత అజయ్ మకెన్ విమర్శలకు ఆమె స్పందించారు. తన పని చూసి తీర్పు చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. మానవ వనరుల శాఖ మంత్రిగా నియమితులై స్మృతి గ్రాడ్యుయేట్ కూడా కారని మకెన్ వ్యాఖ్యానించారు. దానిపై ఆమె గురువారంనాడు స్పందించారు. పని నుంచి తన దృష్టిని మళ్లించడానికి అనవసరమైన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

మోడీ మంత్రివర్గం ఏమిటి, హెచ్ఆర్‌డి మంత్రి స్మృతి ఇరాన కనీసం గ్రాడ్యుయేట్ కూడా కారు, అఫిడవిట్ చూడండి అంటూ మకెన్ ట్వీట్ చేశాడు. దీంతో వివాదం ప్రారంభమైంది. మకెన్ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరానీ అండంగా నిలిచింది. యుపిఎ ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి సోనియా గాంధీ విద్యార్ఙతలేమిటని ప్రశ్నించింది. స్మృతి ఇరానీపై మకెన్ వ్యాఖ్యలు కొంత మంది కాంగ్రెసు నాయకులు కూడా వ్యతిరేకించారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు సరి కాదని మనీష్ తివారీ అన్నారు.

3న మోడీతో జయలలిత భేటీ

తమిళనాడులో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న అన్నాడీఎంకే ఇప్పుడు మోడీ సర్కారులో చేరాలని యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జూన్ 3న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశంకానున్నారు. ఇప్పటికే బిజెపి నాయకులు జయలలితతో చర్చలు జరుపుతున్నారట. బిజెపి సర్కారుకు లోకసభలో మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మెజార్టీ లేదు. ఈ క్రమంలో అన్నాడీఎంకే వంటి పార్టీలను ఎన్డీయేలో చేర్చుకోడానికి బిజెపి ఆసక్తి చూపుతోందంటున్నారు.

ఖుష్బూ

ఖుష్బూ

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మహిళా నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్భూ మద్దతుగా నిలిచారు.

ఖుష్బూ

ఖుష్బూ

స్మృతి ఇరానీ విద్యార్హత పైన పలువురు కాంగ్రెసు నేతలు ప్రశ్నలు కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఖుష్బూ ట్విట్టర్‌లో స్పందించారు. ఎవరికైనా వ్యక్తిగత ప్రతిభ ముఖ్యం కాని... చదువు కాదని ఆమె ట్వీట్ చేశారు.

ఖుష్బూ

ఖుష్బూ

కాగా, తనపై వస్తున్న విమర్శలకు స్మృతి ఇరానీ గురువారం ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు నేత అజయ్ మకెన్ విమర్శలకు ఆమె స్పందించారు. తన పని చూసి తీర్పు చెప్పాలని ఆమె ప్రజలను కోరారు.

ఖుష్బూ

ఖుష్బూ

మానవ వనరుల శాఖ మంత్రిగా నియమితులై స్మృతి ఇరానీ గ్రాడ్యుయేట్ కూడా కారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అజయ్ మకెన్ వ్యాఖ్యానించారు.

ఖుష్బూ

ఖుష్బూ

దానిపై స్మృతి గురువారంనాడు స్పందించారు. పని నుంచి తన దృష్టిని మళ్లించడానికి అనవసరమైన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. స్మృతికి ఖుష్బూ, ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు మద్దతు పలికారు.

English summary
After Congress leader Ajay Maken criticised Smriti Irani for heading the HRD Ministry without having a degree, DMK leader Kushboo has come out in support of Irani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X