వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘శ్రీదేవి’కి ఏదీ ప్రాధాన్యత: ఢిల్లీ పత్రికలపై ఖుష్బూ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దిగ్గజ సినీ నటి శ్రీదేవి మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణవార్తను జాతీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియా కూడా పతాక శీర్షికల్లో ప్రచురితం చేశాయి. అయితే, ఢిల్లీ మీడియా మాత్రం ముఖ్యంగా పత్రికలు ప్రాధాన్యత ఇవ్వకపోడంపై ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమాలంటే ప్రాణం: శ్రీదేవి మరణంతో తిరుపతిలో విషాదం, బంధువుల కన్నీటిపర్యంతంసినిమాలంటే ప్రాణం: శ్రీదేవి మరణంతో తిరుపతిలో విషాదం, బంధువుల కన్నీటిపర్యంతం

ప్రాంతీయ వార్తా పత్రికల నుంచి బీబీసీ, స్కై న్యూస్‌ వంటి అంతర్జాతీయ పత్రికల వరకు శ్రీదేవి, ఆమె నటించిన సినిమాల గురించి ప్రధానంగా పేర్కొన్నాయి. కానీ, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన వార్తా పత్రికల్లో మాత్రం అసలు శ్రీదేవి నటించిన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల జాడే కన్పించలేదు. దీంతో ఖుష్బూ ఢిల్లీ మీడియా వర్గాలపై మండిపడ్డారు.

'ఢిల్లీకి చెందిన ఏ వార్తా పత్రికలో శ్రీదేవి నటించిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల గురించి ఒక్క వార్త కూడా రాయలేదు. ఇది నిజంగా బాధాకరం. ఈ నాలుగు భాషల్లో ఆమె సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నాకే బాలీవుడ్‌కు వెళ్లారు' అని ఓ ఆంగ్ల పత్రిక పాత్రికేయుడు జక్కా జాకోబ్‌ ట్వీట్‌ చేశారు.

అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?

ఈ ట్వీట్‌ను ఖుష్బూ రీట్వీట్ చేస్తూ..'అప్పటి నుంచి నేనూ ఇదే విషయం చెబుతున్నాను' అంటూ పేర్కొన్నారు. శ్రీదేవి బాలీవుడ్ కంటే కూడా దక్షిణాది చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Cine Actress and Congress leader kushboo fired at Delhi media for not given importance to Sridevi's South Cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X