వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి కుష్బుకు కాంగ్రెస్ మొండి చెయ్యి

|
Google Oneindia TeluguNews

చెన్నై: కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్న బహుబాషనటి, ఆ పార్టీ నాయకురాలు కష్బుకు మొండి చెయ్యి చూపించారు. ఆమె శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండా చేశారు. ఎంతో ఆశగా ఎంచుకున్న నియోజక వర్గాన్ని వేరే వారికి కట్టబెట్టిన కాంగ్రెస్ చివరికి చేతులు ఎత్తేసింది.

డీఎంకే కూటమిలో ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తుది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఎన్నికల వాతవరణం వేడేక్కినప్పుడు అందరికంటే ముందుగానే డీఎంకేతో పొత్తుకు ఉరకలేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు చివరికి 41 సీట్లు దక్కించుకున్నారు.

తమిళనాడు కాంగ్రెస్ అధ్యులు ఈవీకేఎన్ ఇళంగోవన్ ను తీవ్రంగా విభేదించే కేంద్ర మంత్రి పి. చిందరబరం, తదితరులను కాదని 33 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను ఇటీవలే విడుదల చేశారు. ఇక మిగిలిన 8 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తుది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేశారు.

 Kushboo not in fray in Tamil Nadu elections

మైలాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నటి కుష్బు ఎంతగానో ఆశించారు. అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద కుష్బు పోటీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చెయ్యాలని కుష్బు ప్రయత్నించారు.

ఇదే విషయంపై కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి వచ్చిన కుష్బు తన సీటుకు ఎలాంటి అడ్డంక్కి లేదని భావించారు. డీఎంకేతో విభేధించి కాంగ్రెస్ పంచన చేరిన కుష్బు రెండు సంవత్సరాల తరువాత కురుణానిధి ఇంటికి వెళ్లి తనను ఆశిర్వధించాలని ఆశీస్సులు పొందారు.

ఎలాగైనా సరే మైలాపూర్ శాసన సభ నియోజక వర్గం సీటును దక్కించుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఆశిస్తున్న మైలాపూర్ శాసన సభ నియోజక వర్గం సీటును కరాటే త్యాగరాజన్ కు కేటాయించారు. మైలాపూర్ నుంచి పోటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా కూడా ఆశించారు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయంపై అధిష్టానం క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంది. ఇద్దరిలో ఎవ్వరికి సీటు ఇచ్చినా సమస్యే అంటూ కొందరు నాయకులు భావించారు. ఇద్దరిని కాదని వేరే వారికి సీటు కేటాయించారు. అయితే అధిష్టానంతో సన్నిహితంగా ఉన్న నగ్మా చక్రం తప్పి కుష్బుకు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Actor and national spokesperson Kushboo will not contest the elections with the Mylapore constituency, which she was expected to bag,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X