• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిజెపి అద్భుత గెలుపు: 30 ఏళ్ల తర్వాత తొలిసారి మేయర్ పదవి

|

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తొలిసారి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన కుసుమ్ సద్రెట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో బిజెపికి అద్భుత విజయం దక్కింది.

మంగళవారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కుసుమ్ సద్రెట్, డిప్యూటీ మేయర్‌గా రాకేష్ శర్మ ఎన్నికయ్యారు. జూన్ 17న ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 34 సీట్లకు గాను 17 సీట్లను బిజెపి గెలిచింది. మెజారిటీకి ఒక్క సీటు దూరంలో నిలిచింది.

Kusum Sadret: BJP gets its first mayor in Shimla

బిజెపి రెబల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన శర్మ తిరిగి పార్టీ గూటికి చేరడంతో బిజెపి ఆధిక్యం సంపాదించింది. ఫలితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీ సొంతమయ్యాయి.

ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనప్పటికీ కాంగ్రెస్, బిజెపిలు మాత్రం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. కాగా, సిమ్లాలో 2012 వరకు కాంగ్రెస్ ఏకధాటిగా 26 ఏళ్లపాటు అధికారాన్ని చెలాయించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
First-time councillor Kusum Sadret, backed by the BJP, was elected Tuesday as the new mayor of Shimla in Himachal Pradesh. This is the first time a BJP leader was elected as the mayor of the city after the saffron party won a majority of wards in the Shimla Municipal Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more