హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీసీఎంబీ అద్భుత ఆవిష్కరణ ! కోళ్లు, గొర్రెలు చంపకుండానే చికెన్, మటన్ !

|
Google Oneindia TeluguNews

దేశంతో పాటు , తెలుగు రాష్ట్ర్రాల్లో మాంసానికి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు ,ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. అయినా సరైన మాంసం కాని , మంచి రకం మాంసం లభించాలంటే చాల కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ బాధలకు ఫల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జంతువులు మూల కణాల ద్వార మాంసాన్ని తయారు చేసేందుకు సీసీఎంబీ సన్నధ్దమవుతోంది.

జంతువులను వధించకుండానే మాంసం !

జంతువులను వధించకుండానే మాంసం !

ఇకపై గొర్రెలు, కోళ్లను చంపకుండానే మాంసం లభించనుందా ? అసలు గొర్రెలు, కోళ్ల మాంసాన్ని వాటిని వధించుకుండానే, వాటి అవసరం లేకుండానే లభిస్తుందని సీసిఎంబీ శాస్త్ర్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం పరిశోధనలు కూడ జరుగుతున్నాయని అంటున్నారు వారు. ఇలాంటీ మాంసాన్ని తయారు చేసే సెంటర్ ను రెండు రోజుల క్రితమే హైద్రబాద్ సీసీఎంబీ మరియు ఎన్ఆర్‌సీం సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

అహింసా మీట్...

అహింసా మీట్...

సాధరణంగా జంతువులను వధించడం హింసకు క్రిందుకు వస్తుంది. అయితే మరోవైపు హింస అనేది చట్టరిత్యానేరం అయినప్పటికి ప్రజల అవసరార్థం జంతువులను వధించి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు .అయితే శాస్గ్ర్రవేత్తలు తయారు చేసే జంతువులకు సంబంధం లేకుండా మాంసాన్ని తయారు చేస్తుండడంతోపాటు అసలు హింసే లేని మాంసం ఉత్పత్తి కాబోతుంది. దీంతో ఈ మాంసానికి '' అహింస మీట్ " పేరు పెట్టారు.

కోళ్లు,గోర్రెలు లేకుండా చికెన్, మటన్ ఎలా ఉంటుంది ?

కోళ్లు,గోర్రెలు లేకుండా చికెన్, మటన్ ఎలా ఉంటుంది ?

జంతువులు మూల కణాల నుండి తయరు చేసే చికెన్, మటన్ అచ్చు సాధరణ మటన్ తోపాటు,చికెన్ కు ఎలాంటీ రంగు ,రుచి ,వాసన ఉంటాయో అలానే ల్యాబ్‌ల్లో తయారయ్యె మాంసం కూడ ఉంటుందని శాస్త్ర్రవేత్తలు తెలిపారు. పైగా ఇలాంటీ మాంసానికి ఎముకలు , కొవ్యు లేకుండా ఉంటుందని తెలిపారు.

ప్యూచర్ ఆఫ్ ప్రోటిన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ సదస్సు

ప్యూచర్ ఆఫ్ ప్రోటిన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ సదస్సు

కాగా ప్రోటిన్‌లతో తాయరు చేసే మాంసం కోసం గతంలోనే ఫ్యూచర్ ఆఫ్ ప్రొటిన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ సదస్సులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.ఇందుకోసం ప్రభత్వం 45 కోట్ల రుపాయలు సైతం కేటాయించింది. దీంతో ఈ ప్రాజెక్టకు తాజాగా రూపకల్పన చేశారు.మరోవైపు సాంకేతికతతో తాయరు చేసే మాంసం వల్ల ఆహర భద్రత ,జంతు సంరక్షణతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదం చేస్తుందని శాస్త్ర్రవేత్తలు తెలిపారు.

English summary
With out sheep ,meet is going to produce with Stem cells in labs, reserch starts by CCMB and NRCM in hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X