వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ దూకుడు: సరిహద్దులకు 30 వేల అదనపు బలగాలు: అతి తీవ్ర చలిని తట్టుకునేలా: సుదీర్ఘకాలం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ మరో కీలక అడుగు ముందుకేసింది. ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించి ఉన్న బలగాలకు అదనంగా మరో 30 వేలమందిని వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. భారీఎత్తున అదనపు సైన్యాన్ని మోహరింపజేసింది. దీనితోపాటు కొత్తగా పలు సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. ఇవన్నీ చైనా పట్ల భారత వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.

అమరావతి ఎఫెక్ట్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మళ్లీ బ్రేక్: నెల తరువాతే..నాలుగోసారి వాయిదాఅమరావతి ఎఫెక్ట్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మళ్లీ బ్రేక్: నెల తరువాతే..నాలుగోసారి వాయిదా

అతి తీవ్ర చలిని తట్టుకునేలా..

అతి తీవ్ర చలిని తట్టుకునేలా..

కొత్తగా పలు కీలక వస్తువులు, సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఆర్మీ అధికారులు ఆర్డర్లు జారీ చేశారు. అతి తీవ్రమైన చలిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న శిబిరాలను కొనుగోలు చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఆర్డర్లకు అనుమతి ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఇలాంటి శిబిరాలను కొనుగోలు చేయనున్నారు సైన్యాధికారులు. ఇలాంటి సైనిక శిబిరాలు ఇప్పటికే ఆర్మీ వద్ద ఉన్నప్పటికీ.. వాటి సామర్థ్యం పరిమితంగా ఉంటోంది. అతి తీవ్రమైన చలికి ఆ శిబిరాలు తట్టుకోలేవని అంటున్నారు. అందుకే- ముందుజాగ్రత్త చర్యగా కొత్తగా శిబిరాలకు ఆర్డర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లఢక్, లేహ్‌లో మైనస్‌లో..

లఢక్, లేహ్‌లో మైనస్‌లో..

సాధారణంగా శీతాకాలంలో లఢక్, లేహ్ వంటి ప్రాంతాల్లో ఉష్షోగ్రత దారుణంగా పడిపోతుంటుంది. గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ వెంబడి రాత్రి ఉష్ణోగ్రత మైనస్‌కు చేరుకుంటూ ఉంటుంది. భౌగోళికంగా చుట్టూ హిమాలయ పర్వతపంక్తులు, ఝంస్కార్ పర్వత శ్రేణులు ఉండటమే దీనికి కారణం. ప్రతి ఏటా శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడం సరిహద్దులలో మోహరించి ఉండే సైన్యానికి అలవాటే. ఈ సారి మాత్రం ప్రత్యేక పరిస్థితులు ఏర్పడటం వల్ల అక్కడి వాతావరణ స్థితిగతులపైనా దృష్టి కేంద్రీకరించారు.

అక్టోబర్ వరకూ

అక్టోబర్ వరకూ

తీవ్రమైన చలిని తట్టుకునే సామర్థ్యం ఉన్న శిబిరాలను భారత ఆర్మీ అధికారులు ఆర్డర్ ఇవ్వడం వల్ల సరికొత్త చర్చకూ దారి తీసినట్టు కనిపిస్తోంది. చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇప్పట్లో చల్లారబోవని ఆర్మీ అధికారులు చెప్పకనే చెప్పినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చలికాలం ఆరంభం కావడానికి ఇంకా సమయం ఉంది. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో తమ చేతికి అందేలా ఈ శిబిరాల కోసం అధికారులు కొనుగోలు ఆర్డర్లు జారీ చేసినట్లు చెబుతున్నారు. అప్పటిదాకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగటం ఖాయమని అంటున్నారు.

అత్యవసర కొనుగోళ్లకు 500 కోట్ల రూపాయలు..

అత్యవసర కొనుగోళ్లకు 500 కోట్ల రూపాయలు..

ఇలాంటి అత్యవసర కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్మీ అధికారులకు అనుమతి ఇచ్చింది. దీనికోసం రక్షణమంత్రిత్వ శాఖకు కేటాయించిన బడ్జెట్ కంటే అదనపు మొత్తాన్ని కేటాయించింది. చలికాల అవసరాల కోసం ప్రత్యేకించి- గాల్వన్ వ్యాలీ వాస్తవాధీన రేఖ వెంబడి ఉండే సైనికు అవసరాలను తీర్చడానికి, అత్యవసర కొనుగోళ్ల కోసం 500 కోట్ల రూపాయల మొత్తాన్ని అదనంగా కేటాయించింది. ఈ మొత్తంతో కొత్తగా శిబిరాలను కొనుగోలు చేయబోతున్నారు ఆర్మీ అధికారులు.

English summary
With over 30,000 additional troops being deployed in the Ladakh sector to counter the Chinese aggression, the Indian Army is going to place emergency orders for extreme cold weather tents for the soldiers on the borders. The need for the tents is being felt as the deployment on the Line of Actual Control (LAC) is expected to be prolonged as the senior armed forces officers feel that the stand-off is likely to continue at least till September-October timeframe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X