వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో చప్పట్ల మోత.. మోడీ ప్రశంసలు.. లడఖ్‌ యువ ఎంపీ మాట్లాడుతుంటే..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సహించడానికి వెనుకడుగు వేయబోరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలా బీజేపీలో ఎంతోమంది యువకులను గుర్తించి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్లిచ్చి గెలిచేలా చేశారు. యువ నేతలను గుర్తించే పనిలో పడ్డ మోడీ ఆ మేరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ క్రమంలో ప్రతిభ చాటే నాయకులను అభినందించడంలోనూ ఆయన ముందుంటారనే విషయం లోక్‌సభ సాక్షిగా ఆవిష్కృతమైంది.

మంగళవారం నాడు ఆర్టికల్ 370 రద్దు తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా.. లోక్‌సభలో చప్పట్ల మోత మోగింది. యువ ఎంపీ మాట్లాడుతున్న వేళ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ తెచ్చిన తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ యువ ఎంపీ ప్రసంగంపై మోడీ ప్రశంసల జల్లు కురింపించారు.

ladakh mp Jamyang Tsering Namgyal extrodinary speech in lok sabha

పీవోకే భారతదేశంలో అంతర్భాగమే.. అసదుద్దీన్‌కు అమిత్ షా కౌంటర్పీవోకే భారతదేశంలో అంతర్భాగమే.. అసదుద్దీన్‌కు అమిత్ షా కౌంటర్

డఖ్ బీజేపీ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నమ్‌గ్యాల్ మాట్లాడుతున్న సందర్భంలో లోక్‌సభ చప్పట్లతో మార్మోగిపోయింది. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు కరతాళ ధ్వనులు వినిపించాయి. దాదాపు 70 సంవత్సరాలుగా లడఖ్ ప్రజలు తమ ప్రాంతానికి కేంద్ర పాలిత హోదా దక్కాలని ఆరాటపడుతున్నారని.. ఇన్నాళ్లకు ఆ కల సాకారం అయిందని.. అదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చలవేనని స్పష్టం చేశారు నమ్‌గ్యాల్. లడఖ్ వెనుకబడటానికి ఆర్టికల్ 370 కారణమని.. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పాపం మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు.

యువ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నమ్‌గ్యాల్ ప్రసంగానికి మోడీ ఫిదా అయ్యారు. లడఖ్ ప్రజల ఆకాంక్షలను తన ప్రసంగంలో చక్కగా వివరించిన యువ ఎంపీ నమ్‌గ్యాల్ అభినందనీయులని ట్వీట్ చేశారు. నా యువ స్నేహితుడు జమ్యాంగ్ సేరింగ్ నమ్‌గ్యాల్.. జమ్ముకశ్మీర్‌కు చెందిన కీలక బిల్లుపై చర్చిస్తున్న సమయంలో అద్భుతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని కొనియాడారు. లడఖ్‌లోని సోదరాసోదరీమణుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఆయన చేసిన ప్రసంగం తప్పకుండా వినాల్సిందేనని కితాబిచ్చారు.

English summary
BJP MP Jamayang Tsering Namgyal speech was attracted in Lok Sabha. All other mps appreciated him. PM Narendra Modi also given credibility to him and mentioned best wishes on twitter. Namgyal Says in his speech as "For almost 70 years, the people of Ladakh have been trying to gain union terrority status in their area. Now, modi has been given that chance, he says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X