వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా తోక జాడిస్తే అంతే.: ఆ 3 దేశాల నుంచి భారత్‌కు ఆయుధాలు, 27న రఫేల్ యుద్ధ విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా ఘర్షణలకు తెగబడిన నాటి నుంచి సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఓ వైపు చర్చలంటూనే.. మరోవైపు సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తోంది డ్రాగన్ దేశం. దీంతో భారత్ కూడా భారీ ఎత్తున రక్షణ దళాలను, ఆయుధాలను, క్షిపణులను తరలిస్తోంది. చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగితే మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది.

జులై 27న భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు

జులై 27న భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు

ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి ఆయుధాలను, యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను వెంటనే రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా, జులై 27 నాటికి అత్యాధునిక క్షిపణులను అమర్చిన రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.

భారతీయ పైలట్లే యుద్ధ విమానాలతో..

భారతీయ పైలట్లే యుద్ధ విమానాలతో..

నాలుగు విమానాలు రావాల్సి ఉండగా.. ఆరు విమానాలను అందజేయాలని భారత్ స్పష్టం చేసింది. దీంతో ఫ్రాన్స్ నుంచి ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఇక భారతీయ పైలట్లకు ఈ విమానాలపై శిక్షణ కూడా కొనసాగుతోంది. శిక్షణ పొందిన మన పైలట్లే ఫ్రాన్స్ నుంచి విమానాలను భారత్‌లోని అంబాలా వాయుసేన స్థావరానికి చేర్చే అవకాశం ఉంది.

రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలు..

రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలు..


ఇది ఇలావుంటే, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం రష్యాపై ఒత్తిడి పెంచింది. రావాల్సిన సమయం కంటే ముందుగానే భారత్‌కు చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యాను కోరారు. ఈ క్రమంలో భారత్ కు అవసరమైన బిలియన్ విలువైన అదనపు ఆయుధ సామాగ్రిని కొన్ని వారాల్లో సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించడం గమనార్హం.

Recommended Video

#BoycottNetflix : Krishna And His Leela మూవీ పై హిందూ సంఘాల ఫైర్
అమెరికా నుంచి లక్ష్యాలను ఛేదించే శతఘ్ని గుండ్లు..

అమెరికా నుంచి లక్ష్యాలను ఛేదించే శతఘ్ని గుండ్లు..

మరోవైపు అమెరికా నుంచి కూడా అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది భారత్. శతఘ్నుల్లో వినియోగించే కీలకమైన గుండ్లను భారత్ ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటితోపాటు ఎం777 శతఘ్నుల్లో వినియోగించే ఎక్సాక్యాలిబర్ శతఘ్ని గుండ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే భారత్‌కు మద్దతుగా నిలుస్తామని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా ఆగడాలను అరికట్టేందుకు ఈ దేశాలన్నీ ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

English summary
As Indian troops remain dug in at Ladakh in a prolonged standoff with China, allies are pitching in with commitments to deliver urgently needed weapons and ammunition for the Indian armed forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X