Bengaluru: వన్ సైడ్ లవ్, ప్రియురాలి మీద యాసిడ్ దాడి, సైకో ఉన్నాడా ?, చచ్చాడా?
బెంగళూరు/ కామాక్షిపాళ్యఫ బెంగళూరులోని కామాక్షిపాళ్యలో 23 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది, యవతి నివాసం ఉంటున్న ఏరియాలోనే నాగేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, యువతికి, నాగేష్ కు వయసులో 9 సంవత్సరాల తేడా ఉందని తెలిసింది, ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతికి, నాగేష్ కు ముందే పరిచయం ఉంది.
ఆ యువతిని నాగేష్ ప్రేమించాడు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వన్ సైడ్ లవర్ నాగేష్ అనుకున్నాడు. తనను ప్రేమించాలని ఆమె మీద నాగేష్ ఒత్తిడి చేశాడు. ఎంఏ పూర్తి చేసిన యువతి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. వెంటపడుతున్న నాగేష్ ను ప్రేమించడం ఆమెకు ఇష్టం లేదు. తనను ప్రేమించాలని నాగేష్ మాత్రం ఆమె వెంటపడటంతో ఆమె ఇంట్లో విషయం చెప్పడానికి భయపడింది.

గురువారం ఉదయం యువతిని ఆమె ఆఫీసు దగ్గర డ్రాప్ చేసిన తండ్రి బైక్ లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తండ్రి అక్కడి నుంచి వెళ్లి ఒక్క నిమిషం కూడా పూర్తి కాకుండానే నాగేష్ ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు. నన్ను ప్రేమిస్తావా లేదా ?, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ? అని ఆమెను నాగేష్ ప్రశ్నించాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఆమె నాగేష్ కు తేల్చి చెప్పింది. అంతే వెంటనే ఆమె మీద యాసిడ్ పోసిన నిందితుడు నాగేష్ అక్కడి నుంచి పరారైనాడు,
యువతి మీద యాసిడ్ దాడి చేసి చాలాచాకచక్యంగా తప్పించుకునిపారిపోయిన నాగేష్ కోసం ఆరు రోజుల నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. బెంగళూరులో జరిగిన యాసిడ్ దాడి ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. నాగేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఇప్పటికే పోలీసులు విచారణ చేసినా అతని ఆచూకి మాత్రం చిక్కలేదు. అయితే నాగేష్ ఎక్కడైనా తలదాచుకున్నాడా ?, ఇతర రాష్ట్రాలకు పారిపోయాడా ?, ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే విషయం మాత్రం అంతు చిక్కడం లేదు.