వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ కొంపముంచింది.. పోలీస్ స్టేషన్‌లో వీడియో చేసిన లేడీ కానిస్టేబుల్.. సస్పెండ్ చేసిన అధికారులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

టిక్‌టాక్ మాయలో పడి ఉద్యోగాలు పోగొట్టుకున్న మహిళలు || GOVT Employees Suspended Due To Tiktok videos

టిక్‌టాక్.. షార్ట్ వీడియోలతో చిన్నా పెద్ద అందరినీ ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా యాప్. అయితే దీనిపై ఎన్నో విమర్శలు. మరెన్నో వివాదాలు. టిక్‌టాక్‌‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చివరకు కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నాయి. టిక్ టాక్ వీడియోలు చేస్తూ కొందరు గాయపడితే.. మరికొందరు చనిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విధి నిర్వాహణలో ఉండగా టిక్ టాక్ వీడియో చేసిన ఓ లేడీ కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టుకుంది.

గుజరాత్‌లోని లాంగ్‌నజ్ పోలీస్ స్టేషన్‌లో అర్పిత కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటున్న ఆమె మౌసమోకీ తరాహ్.. తూ బదల్తా గయా.. అనే పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేసింది. జులై 20న పోస్ట్ చేసిన వీడియోను నాలుగు రోజుల్లోనే 12 వేల మంది చూశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Lady constable Suspended After Video Of Her Dancing In Police Station

అర్పిత ఇప్పటి వరకు 15కుపైగా టిక్ టాక్ వీడియోలు రూపొందించి పోస్ట్ చేసింది. 2016లో పోలీస్ విభాగంగా లోక్ రక్షక్ దళ్‌లో చేరిన ఆమె ప్రస్తుతం లాంగ్‌నజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. డ్యూటీలో ఉన్న సమయంలో యూనిఫామ్ వేసుకోకపోవడం, పోలీస్ స్టేషన్‌లో వీడియో తీసినందుకు గానూ అర్పితను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారెవరినీ ఉపేక్షించే ప్రసక్తేలేదని డీఎస్పీ హెచ్చరించారు.

English summary
A young police woman from Gujarat was suspended on Wednesday after a video of her dancing inside a police station to a song went viral on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X