బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. లక్ష జీతం: రూ. 100 కోసం ఆశపడి పాకిస్థానీలకు ఆధార్ కార్డు: లేడీ డాక్టర్ అరెస్టు !

నెలకు లక్ష రూపాయలు జీతం వస్తున్నా కేవలం రూ. 300కు ఆశపడి లేడీ డాక్టర్ నాగలక్ష్మమ్మాల్ ఇచ్చిన డిక్లరేషన్ తో ఇద్దరు మహిళలతో సహ ముగ్గురు పాకిస్థానీలు ఆధార్ కార్డుతో పాటు అనే ఐడీ కార్డులు సంపాధించుకుని

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దాయాది పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు అక్రమంగా ఆధార్ కార్డులు తీసుకోవడానికి పరోక్షంగా సహకరించిన కర్ణాటక ప్రభుత్వ వైద్య శాఖ ఉద్యోగిని డాక్టర్ సీఎస్. నాగలక్ష్మమ్మాల్ ను బెంగళూరు నగరంలోని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు.

జయనగర ప్రభుత్వం ఆసుపత్రిలో డిప్యూటీ చీఫ్ మెడికల్ అధికారిగా పని చేస్తున్న లేడీ డాకర్టర్ నాగలక్ష్మమ్మాల్ ను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ (పశ్చిమ) మాలిని క్రిష్ణమూర్తి తెలిపారు.

మహిళలతో సహ పాకిస్థాన్ జాతీయులు !

మహిళలతో సహ పాకిస్థాన్ జాతీయులు !

ఒక్క వారం ముందు (గత బుధవారం) బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ లో కేరళకు చెందిన మహమ్మద్ షిహాబ్, అతని భార్య సమీరా అబ్దుల్ రెహమాన్, వీరి బంధువులు ఖాసీం షంశుద్దీన్, అతని భార్య కిరణ్ గులామ్ ఆలీలను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర ఉన్న నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నెలకు రూ. లక్ష జీతం, రూ. 100 కోసం జైలుకు !

నెలకు రూ. లక్ష జీతం, రూ. 100 కోసం జైలుకు !

జయనగర ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ వైద్యురాలిగా ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న లేడీ డాక్టర్ సీఎస్ నాగలక్ష్మమ్మాల్ కు నెలకు దాదాపు ఒక లక్ష రూపాయల వరకు జీతం వస్తోందని వెలుగు చూసింది. అయితే కేవలం రూ. 100 తీసుకుని గుడ్డిగా కొన్ని పత్రాల్లో గెజిటెడ్ సంతకాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

రూ. 300కు పాకిస్థానీలకు ఆధార్ కార్డులు !

రూ. 300కు పాకిస్థానీలకు ఆధార్ కార్డులు !

కేరళకు చెందిన మహమ్మద్ షహీబ్ కొన్ని పత్రాలు తీసుకెళ్లి లేడీ డాక్టర్ సీఎస్. నాగలక్ష్మమ్మాల్ కు ఇచ్చాడు. అతని దగ్గర రూ. 300 తీసుకున్న డాక్టర్ నాగలక్ష్మమ్మాల్ మరో ముగ్గురి గుర్తింపు పత్రాలు పరిశీలించకుండానే వాటి మీద గెజిటెడ్ సంతకం చేశారు. ఓరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించిన తరువాత అటస్టేషన్ చెయ్యాలని ప్రభుత్వం నియమాలు విధించినా ఆమె మాత్రం పట్టించుకోలేదని వెలుగు చూసింది.

ఐడీ కార్డు తీసుకున్నారు !

ఐడీ కార్డు తీసుకున్నారు !

లేడీ డాక్టర్ నాగలక్ష్మమ్మాల్ ఇచ్చిన డిక్లరేషన్ (గెజిటెడ్ సంతకం)తో ఇద్దరు మహిళలతో సహ ముగ్గురు పాకిస్థానీలు ఆధార్ కార్డుతో పాటు అనే ఐడీ కార్డులు సంపాధించుకుని స్వేచ్చగా బెంగళూరులో సంచరిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

రెంటల్ అగ్రిమెంట్ చూసి !

రెంటల్ అగ్రిమెంట్ చూసి !


కేరళ నివాసి మహమ్మద్ షహీబ్ తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటి యజమాని దగ్గర మొదట రెంటల్ అగ్రిమెంట్ తీసుకున్నాడు. ఆ రెంటల్ అగ్రిమెంట్ చూసి తాను గెజిటెడ్ సంతకం చేశానని, తనకు ఏ పాపం తెలీదని లేడీ డాక్టర్ నాగలక్ష్మమ్మాల్ పోలీసుల విచారణలో అంగీకరించారని తెలిసింది.

చోరీ కేసు దర్యాప్తు చేస్తే పాక్ !

చోరీ కేసు దర్యాప్తు చేస్తే పాక్ !

కుమారస్వామి లేఔట్ పోలీసులు ఓ కారు చోరీ కేసు విచారణ చేస్తున్న సమయంలో మహమ్మద్ షహీబ్ అనే వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. ఆ వ్యక్తి కోసం గాలిస్తూ పాకిస్థానీలు నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. విచారణలో ఆ ఇంటిలో పాకిస్థానీలు ఉన్నారని వెలుగు చూడటంతో పోలీసులతో సహ బెంగళూరు ప్రజలు షాక్ కు గురైనారు.

ఎంత మందికి ఇచ్చారు !

ఎంత మందికి ఇచ్చారు !

రూ. 100 కోసం ఆశపడి లేడీ డాక్టర్ ఇలా ఎంత మందికి ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించుకుండా నకిలీ దృవీకరణ పత్రాలు ఇచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. లేడీ డాక్టర్ నాగలక్ష్మమ్మాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. లేడీ డాక్టర్ నాగలక్ష్మమ్మాల్ కు సహకరించిన మరో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రవికుమార్ ను సస్పెండ్ చేసి విచారణ మొదలుపెట్టారు.

English summary
The accused identified as Dr CS Nagalakshammamal was working as the Deputy Chief Medical Officer at the hospital and has been remanded in police custody for further questioning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X