• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady doctor: బిడ్డ రూ. 16 లక్షలకు డీల్, ఏడాదికి కిలాడీ డాక్టర్ ?, డీఎన్ఏ పరీక్ష, రష్మీ స్కెచ్ !

|

బెంగళూరు/ హైదరాబాద్/ చెన్నై: ఏడాది క్రితం బెంగళూరులోని వాణి విలాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డ మాయం అయ్యింది. బిడ్డ మాయం అయిన కేసులో పోలీసులకు చిన్నసాక్షం కూడా చిక్కలేదు. కేవలం కొన్నిసెకన్ల సీసీటీవీ క్లిప్పింగ్ తో కేసు విచారణ జరిగింది. సరిగ్గా ఏడాది తరువాత మాయం అయిన బిడ్డ ఆచూకిని పోలీసులు పసిగట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ప్రముఖ ఆసుపత్రిలో లేడీ డాక్టర్ అని వెలుగు చూడటం కలకలం రేపింది. చోరీ చేసిన పసిబిడ్డను ఆ లేడీ డాక్టర్ రూ. 16. 50 లక్షలకు విక్రయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అచ్చం సినిమా స్టోరీలాగా టెస్ట్ ట్యూబ్ బేబి మా సొంత బిడ్డ అని ఏడాది పాటు ఎంతో మురిపంగా చూసుకున్న దంపతులు ఇప్పుడు ఆ బిడ్డ మా బిడ్డ కాదు, చోరీకి గురైన బిడ్డ అని తెలుసుకున్న ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఏడాది వయసు ఉన్న బిడ్డకు DNA పరీక్షలు నిర్వహించి ఆ బిడ్డ ఏవరి బిడ్డ ? అని తేల్చడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

Girlfriend: ప్రియుడికి హ్యాండ్, సీక్రెట్ పెళ్లి, భర్త ముందే లాగేసి రివాల్వర్ తో ?, రమ్మంటే రాలేదని !Girlfriend: ప్రియుడికి హ్యాండ్, సీక్రెట్ పెళ్లి, భర్త ముందే లాగేసి రివాల్వర్ తో ?, రమ్మంటే రాలేదని !

 దంపతుల పాప

దంపతుల పాప

బెంగళూరులోని చామరాజపేట సమీపంలోని జగజ్జీవన్ రామ్ నగర్ (జేజే నగర్) లో నవీద్ పాషా, హుస్నాబాను దంపతులు నివాసం ఉంటున్నారు. 2020 మే 29వ తేదీన పురుటి నోప్పులతో హుస్నాబాను బెంగళూరులోని కేఆర్ మార్కెట్ సమీపంలోని బీబీఎంపీకి చెందిన వాణి విలాస్ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు హుస్నాబాను ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

 కొన్ని సెకన్లలో బిడ్డ మాయం

కొన్ని సెకన్లలో బిడ్డ మాయం

ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వాణివిలాస్ ఆసుపత్రిలోకి ఎవరైనా వెళ్లాలంటే చాలా కష్టం. రోగుల బంధువులు తప్పా వేరే వారు లోపలికి వెళ్లడానికి అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అవకాశం ఇవ్వరు. అలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న వాణి విలాస్ ఆసుపత్రిలో హుస్నాబాను బిడ్డ మాయం కావడం కలకలం రేపింది. కేసు విచారణ చేసిన పోలీసులకు ఎలాంటి సాక్షం చిక్కలేదు. అయితే సీసీటీవీ కెమెరాల్లో బిడ్డను ఓ మహిళ ఎత్తుకుని వెలుతున్న దృశ్యాలు కొన్ని సెకన్లు మాత్రమే రికార్డు అయ్యాయి.

 లేడీ డాక్టర్ పట్టించిన రూపురేఖలు

లేడీ డాక్టర్ పట్టించిన రూపురేఖలు

వాణి విలాస్ ఆసుపత్రిలోని సీసీటీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు మహిళ ఊహాచిత్రాన్ని గీపించారు. ఆ ఊహాచిత్రం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ రష్మీ (34) అనే లేడీ వాణి విలాస్ ఆసుపత్రిలో బిడ్డను ఎత్తుకుని వెళ్లిపోయిందని పోలీసుల విచారణ వెలుగు చూసింది.

 హుబ్బళిలో స్కెచ్...... రూ. 16.50 లక్షలకు డీల్

హుబ్బళిలో స్కెచ్...... రూ. 16.50 లక్షలకు డీల్

2014లో డాక్టర్ రష్మీ హుబ్బళిలోని ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం చేసే సమయంలో కోప్పళకు చెందిన దంపతులు ఆమెకు పరిచయం అయ్యారు. కోప్పళ దంపతులకు మానసిక వ్యాధులతో కుంగిపోతున్న బిడ్డకు చికిత్స చెయ్యడానికి డాక్టర్ రష్మీ దగ్గరకు వెళ్లే సమయంలో ఆ లేడీ డాక్టర్ కు దగ్గర అయ్యారు. మీకు అద్దె గర్బంతో మంచి బిడ్డను పుట్టించడానికి రూ. 16.50 లక్షలు ఖర్చు అవుతోందని, మీరు ఓకే అంటే నేను తరువాత కథ చూసుకుంటానని డాక్టర్ రష్మీ ఆ దంపతులకు చెప్పింది.

 వీర్యం.... అండాలు తీసుకున్న డాక్టర్ రష్మీ

వీర్యం.... అండాలు తీసుకున్న డాక్టర్ రష్మీ

కోప్పళ దంపతుల వీర్యం, అండాలు సేకరించిన డాక్టర్ రష్మీ తనకు బాగా తెలిసిన, ఆరోగ్యంగా ఉన్న మహిళ గర్బంలో వీటిని ఇంజెక్షన్ చేసి మీకు బిడ్డను పుట్టిస్తానని వారి దగ్గర కొన్ని లక్షల రూపాయలు అడ్వాన్స్ తీనుకునింది. తరువాత డాక్టర్ రష్మీ కోప్పళ దంపతుల ఆ వీర్యం, అండాలు వేరే మహిళ గర్బంలోకి పంపించలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ఏడాది వరకు అంతా ఓకే

ఏడాది వరకు అంతా ఓకే

వాణి విలాస్ ఆసుపత్రిలో హుస్నాబాను బిడ్డను ఎత్తుకుని వెళ్లిపోయిన డాక్టర్ రష్మీ ఆ బిడ్డను కోప్పళ దంపతులకు ఇచ్చేసి వారి దగ్గర మిగిన డబ్బులు మొత్తం తీసుకునింది. రూ. 16. 50 లక్షలు ఇచ్చిన కోప్పళ దంపతులు ఏడాడి పాటు ఆ బిడ్డ మా సొంత బిడ్డ అంటూ ఎంతో మురిపంగా పెంచుకున్నారు. ఇటీవల పోలీసులు ఎంట్రీ ఇచ్చే వరకు ఆ బిడ్డ బెంగళూరులో చోరీ అయిన బిడ్డ అనే విషయం కోప్పళ దంపతులకు ఏమాత్రం తెలీదని పోలీసు అధికారులు అంటున్నారు.

 నేను దొంగను కాదు..... చివరికి లేడీ డాక్టర్ ?

నేను దొంగను కాదు..... చివరికి లేడీ డాక్టర్ ?

నా కడుపులో ఎవ్వరి వీర్యం, అండాలు ఎక్కించలేదని, ఈ బిడ్డ మా సొంత బిడ్డ అని హుస్నాబాను దంపతులు పోలీసులకు చెప్పారు. మొదట హుస్నాబాను కడుపులో అద్దెబిడ్డ పెరిగిందని, ఆ బిడ్డే ఈ బిడ్డ అని డాక్టర్ రష్మీ గట్టిగా చెప్పింది. తరువాత తాను బిడ్డను చోరీ చేశానని డాక్టర్ రష్మీ అంగీకరించిందని పోలీసు అధికారులు అంటున్నారు.

 బిడ్డకు డీఎన్ ఏ పరీక్షలు

బిడ్డకు డీఎన్ ఏ పరీక్షలు

ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లులు గొడవకు దిగడంతో పోలీసులు ఇప్పుడు ఆ బిడ్డకు డీఎన్ ఏ పరీక్షలు చేయిస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రిలో ఎంతో పేరు సంపాధించుకుని వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ రష్మీని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. కరోనా వైరస్, లాక్ డౌన్ టైమ్ లో ఇలాంటి కేసు చేధించిన పోలీసులను బెంగళూరు పోలీసు కమీషనర్ కమల్ పంత్ అభినందించారు.

English summary
Lady doctor: Basavanagudi women police have been arrested psychiatrist who theft child in Vani Vilas Children govt hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X