బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady doctor: ఆసుపత్రిలో ఉద్యోగం, డాక్టర్ గాడు ఏం చేశాడంటే, శారీరకంగా, ఆంటీ, అంకుల్ ఎంట్రీతో ?

లేడీ డాక్టర్ ఒక చోట,ఆమె కుటుంబ సభ్యులు మరో రాష్ట్రంలో ఉండటంతో ఫోన్లలోమాట్లాడుకుంటున్నారు.ఉద్యోగం చేస్తున్న లేడీ డాక్టర్ శవమై కనిపించింది.అదే ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ మీద లేడీ డాక్టర్ తల్లిదండ్రులు కేసుపెట్టార

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ లక్నో: డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన యువతి ఎంతో ఫేమస్ అయిన అదే కాలేజ్ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. మంచి విద్యార్థినిగా, మంచి డాక్టర్ గా ఆ ఆసుపత్రిలో మంచి పేరు సంపాధించుకుంది. మంచి ఉద్యోగం చేస్తున్న యువతికి మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కూతురు ఓ రాష్ట్రంలో ఉండటం, ఆమె కుటుంబ సభ్యులు మరో రాష్ట్రంలో ఉండటంతో అందరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఉద్యోగం చేస్తున్న లేడీ డాక్టర్ శవమై కనిపించడం కలకలం రేపింది. అదే ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ మీద లేడీ డాక్టర్ తల్లిదండ్రులు కేసు పెట్టడం కలకలం రేపింది.

Menaka: కోటీశ్వరులైన మసలోళ్లకు స్వర్గం చూపించిన మేనకా, వయస్సు 29, ఏం చేసిందంటే? ఫినిష్!Menaka: కోటీశ్వరులైన మసలోళ్లకు స్వర్గం చూపించిన మేనకా, వయస్సు 29, ఏం చేసిందంటే? ఫినిష్!

లేడీ డాక్టర్ ఆత్మహత్య

లేడీ డాక్టర్ ఆత్మహత్య

వన్ సైడ్ ప్రేమ విషయంలో విసుగు చెంది ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో కలకం రేపింది. ఐటీ హబ్ బెంగగళూరు సిటీలోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగశెట్టిహళ్లి నివాసి ప్రియాంషి త్రిపాఠి అలియాస్ ప్రియాంషి (28) అనే లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. లేడీ డాక్టర్ ప్రియాంషి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో సాటి డాక్టర్లు బిత్తరపోయారు.

లేడీ డాక్టర్ ఫ్యామిలీ ఎంట్రీ

లేడీ డాక్టర్ ఫ్యామిలీ ఎంట్రీ

ప్రేమ, పెళ్లి విషయంలో తన కుమార్తె ప్రియాంషి సాటి వైద్యుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు డాక్టర్ సుమీత్‌పై బెంగళఊరులోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో సంజయ్ నగర్ పోలీసులు డాక్టర్ సుమీత్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ప్రియాంషి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాకు చెందినది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంసి మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకోవాలని, కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలుకంది.

బెంగళూరులో లేడీ డాక్టర్

బెంగళూరులో లేడీ డాక్టర్

బెంగళూరులోని యశవంతపురం సమీపంలోని మత్తికెరేలోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో చేరిన ప్రియాంషి రెండేళ్ల క్రితం ఆమె పీజీ వైద్య విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత ప్రియాంషి బెంగళూరు నగరంలో ఎంతో ప్రసిద్ది చెందిన ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో డాక్టర్ గా ఉద్యోంలో చేరింది. చాలా కాలంగా ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలోనే ప్రియాంషి డాక్టర్ గా ఉద్యోగం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మెడికల్ కాలేజ్ ఫ్రెండ్ తో లేడీ డాక్టర్ ?

మెడికల్ కాలేజ్ ఫ్రెండ్ తో లేడీ డాక్టర్ ?

కాలేజీలో చదువుతున్న సమయంలో క్లాస్‌మేట్ సుమీత్‌తో ప్రియాంషికి పరిచయం ఏర్పడింది. తరువాత ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. బయట ఊర్లలో ఉన్న ప్రియాంషి, సుమీత్ కలిసి తిరిగారు. అయితే ఇటీవల ప్రియాంషి, సుమీత్ ల మధ్య వ్యక్తిగతంగా మనస్పర్ధలు వచ్చాయని వెలుగు చూశాయి. ప్రియురాలు డాక్టర్ ప్రియాంషి దూరం అవుతోందని అనుకున్న డాక్టర్ సుమీత్ ఆమె మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు, అయితే ఇంతకాలం ప్రియాంషి చాల ఓపికగా ఉంటూ వచ్చింది.

లేడీ డాక్టర్ ఆత్మహత్య

లేడీ డాక్టర్ ఆత్మహత్య

రానురాను డాక్టర్ సుమీత్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని టార్చర్ తట్టుకోలేక లేడీ డాక్టర్ ప్రియాంషి విసిగిపోయింది. చివరికి నివాసం ఉంటున్న రూమ్ లోనే డాక్టర్ ప్రియాంషి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది, కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ లోని లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు బెంగళూరు వచ్చారు. కూతురు ప్రియాంషి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియాంషి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.

వాడు శాడిస్టు డాక్టర్

వాడు శాడిస్టు డాక్టర్

లేడీ డాక్టర్ ప్రియాంషి తండ్రి సుశీల్ బెంగళూరు చేరుకుని కూతురు మాజీ బాయ్ ఫ్రెండ్ సుమిత్ మీద కేసు పెట్టాడు. ప్రతినిత్యం తన కూతురు ప్రియాంషికి సుమిత్ టార్చర్ పెట్టాడని, అతని విలాసాలకు ప్రతినెల డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని, డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ప్రతినిత్యం తన కూతురికి సుమిత్ టార్చర్ పెట్టాడని లేడీ డాక్టర్ ప్రియాంషి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మా కుమార్తె ప్రియాంషి దూరం అవుతోందని డాక్టర్ సుమిత్ శాడిస్టులాగా తయారైనాడని ఆమె తండ్రి సుశీల్ పోలీసులకు చెప్పాడు.

ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టాడు

ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టాడు

మా కుమార్తె ప్రియాంషిని పెళ్లి చేసుకోవాలని డాక్టర్ సుమిత్ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని బాధితురాలి తండ్రి సుశీల్ పోలీసులకు చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో తన కూతురు ప్రియాంషి మద్యం సేవిస్తుందని, సిగరెట్లు తాగుతుందని కాలేజ్ లో, ఆసుపత్రిలో అందరికి తప్పుడు ప్రచారం చేశాడని ప్రియాంషి తండ్రి సుశీల్ ఆరోపించారు.

ఆంటీ వార్నింగ్ ఇచ్చినా వినలేదు

ఆంటీ వార్నింగ్ ఇచ్చినా వినలేదు

మేము మే 2022లో బెంగుళూరుకు వచ్చి, డాక్టర్ సుమీత్‌ని మా కూతురు ప్రియాంషి జోలికి రాకూడదని హెచ్చరించామని, కొన్ని రోజుల క్రితం కూడా అతనికి ఫోన్ చేసి ఇదే మాట చెప్పామని, అయితే సుమిత్ అతని వైఖరి మార్చుకోలేదు, ఈ పరిణామం వల్లే మా కూతురు ప్రియాంషి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు సశీల్ దంపతులు సంజయ్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శాడిస్టు డాక్టర్ సుమిత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Lady doctor committed suicide, ex-boyfriend could not bear the physical and mental violence and left her life in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X