చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady IPS: గోకించుకునే వయసులో గోకడం అవసరమా సార్ ?, ఏడీజీపీకి సీన్ సిడేల్, సీబీసీఐడీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు/ న్యూఢిల్లీ: లా అండ్ ఆర్డర్ విభాగం తన చేతిలో ఉందని సీనియర్ ఐపీఎస్ ఆఫిసర్, ఏడీజీపీ రెచ్చిపోయాడు. గోకించుకోవాల్సిన వయసులో పక్కనే ఉన్న లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ను గోకిన ఏడీజీపీ గారికి సినిమా చూపిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ స్వయంగా ఏడీజీపీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టడం, మానవహక్కల సంఘం జోక్యం చేసుకోవడంతో దూమరం రేపింది. మన అయ్యగారికి కేసును ప్రభుత్వం, పోలీసు పెద్దలు సీబీసీఐడికి అప్పగించారు. ఏడీజీపీ మీద నాలుగు సెక్షల కింద కేసు నమోదు చేసిన సీబీసీఐడీ అధికారులు అయ్యగారికి సినిమా చూపించడానికి సిద్దం అవుతున్నారని సమాచారం.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

కారు ఎక్కించుకున్న అయ్యగారు

కారు ఎక్కించుకున్న అయ్యగారు

తమిళనాడు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ (ADGP) రాజేష్ దాస్ మీద అదే రాష్ట్రంలోని డెల్టా జిల్లాలో ఎస్పీగా పని చేస్తున్న లేడీ ఐపీఎస్ ఆఫీసర్ లైంగిక వేధింపులు చేశారని ఆరోపణలు చేశారు. తన కారులో ఎక్కించుకున్న ఏడీజీపీ రాజేష్ దాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఆరోపణలు చేశారు.

డ్రైవర్ ను కిందకు దింపేసి కారులో ?

డ్రైవర్ ను కిందకు దింపేసి కారులో ?

ఏడీజీపీ రాజేష్ దాస్ కారులో మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కొంతదూరం ప్రయాణించారు. తరువాత ఏడీజీపీ రాజేష్ దాస్ ఆయన కారును రోడ్డు పక్కన నిలపాలని చూపించారని, తరువాత కారు డ్రైవర్ ను కిందకు దిగిపొమ్మని చెప్పి మరీ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ లేడీ ఐపీఎస్ అధికారి లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ రాజేష్ దాస్ మీద తమిళనాడు డీజీపీ త్రిపాఠికి ఇప్పటికే ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు శాఖతో పాటు రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

విశాఖ కమిటీ నివేదిక !

విశాఖ కమిటీ నివేదిక !

డీజీపీ స్థాయి పోలీసు అధికారి మీద సాటి లేడీ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపుల కేసు పెట్టడం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు విచారణ చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో విశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తమిళనాడు అదనపు డీజీపీ సీమా అగర్వాల్, డీఐజీ చాముండేశ్వరి, ఐజీ అరుణ్, ఐపీఎస్ అధికారి రమేష్ బాబు, మహిళా స్వచ్చంద సంస్థ నాయకురాలు లోరెరా జోనా ఉన్నారు. రెండు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం విశాఖ కమిటీకి సూచించింది.

కేసు వెనక్కి తీసుకోండి మేడమ్?

కేసు వెనక్కి తీసుకోండి మేడమ్?


ఇదే సమయంలో ఏడీజీపీ రాజేష్ దాస్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన లేడీ ఐపీఎస్ అధికారిని మీద ఓత్తిడి ఎక్కువ అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. కేసు వెనక్కి తీసుకోవాలని పోలీసు శాఖలోనే ఉన్న కొందరు పెద్దలు లేడీ ఐపీఎస్ మీద ఒత్తిడి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

సీబీసీఐడీ ఎంట్రీతో సీన్ సిడేల్

సీబీసీఐడీ ఎంట్రీతో సీన్ సిడేల్

ఏడీజీపీ మీద అదే పోలీసు శాఖలోని లేడీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల కేసు పెట్టడం దూమరం రేపింది. సొంత శాఖలోని పోలీసు అధికారుల మీద అనేక ఆరోపణలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం సూచనతో ఆ రాష్ట్ర డీజీపీ త్రిపాఠి కేసును సీబీసీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీబీసీఐడీ అధికారులు ఏడీజీపీ రాజేష్ దాస్ విషయంలో సీరియస్ గా విచారణ మొదలుపెట్టడంతో సీన్ సిడేల్ అయిపోయింది.

గోకించుకునే వయసులో గోకడం అవసరమా సార్ ?

గోకించుకునే వయసులో గోకడం అవసరమా సార్ ?

ఏడీజీపీ హోదాలో హుందాగా ఉండాల్సిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేష్ దాస్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. గోకించుకునే వయసులో మీరు సాటి ఉద్యోగులను గోకడం అంత అవసరమా సార్ ? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏడీజీపీ రాజేష్ దాస్ మీద ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసిన సీబీసీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు.

English summary
Lady IPS: 4 cases are registered against Tamil Nadu Additional DGP Rajesh Das.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X