చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady killer:జయమాలకు రివాల్వర్ ఇచ్చిన మాజీ ఆర్మీ ఆఫీసర్ అరెస్టు, లగ్జరీ లైఫ్ కోసం స్కెచ్, అన్న లాయర్

|
Google Oneindia TeluguNews

చెన్నై/ జైపూర్/ ఆగ్రా: మెంటల్ మొగుడితో కాపురం చెయ్యలేక పోయానని, లగ్జరీ లైఫ్ గడపడానికి తన భర్త, అత్తమామలను తాను చంపేయాలని డిసైడ్ అయ్యానని కోడలు అంగీకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. తన సొంత సోదరుడు లాయర్ కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందని ముగ్గురి హత్యకు స్కెచ్ వేశామని కోడలు అంగీకరించింది. భర్త, అత్తమామలను హత్య చెయ్యడానికి ఉపయోగించిన రివాల్వర్ ఓ రిటైడ్ ఆర్మీ అధికారిది కావడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. హంతకులు ఉపయోగించిన కారు మాజీ ఎయిర్ ఫోర్స్ లేడీ ఆఫీసర్ ది కావడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిలాడీ కోడలు, ఆమె సొంతసోదరుడైన క్రిమినల్ లాయర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Illegal affair: ఆంటీ 45, లవర్ 29, ప్రియుడు చచ్చాడని సమాధి తొవ్వింది, ఫ్యామిలీ చివాట్లు పెడితే!

 ఒకే రోజు కోటీశ్వరులు దారుణహత్య

ఒకే రోజు కోటీశ్వరులు దారుణహత్య

రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై సిటీ చేరుకున్నారు. చెన్నైలోని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో దలీల్ చంద్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ కుమార్ (40), పింక్ (36) అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీన రాత్రి చెన్నైలో వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే దలీల్ చంద్, పుష్పాబాయ్, సీతల్ కుమార్ దారుణ హత్యకు గురైనారు.

 కిల్లర్ కోడలు

కిల్లర్ కోడలు

ఫైనాన్సియర్ దలీల్ చంద్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోడలు జయమాల, ఆమె సోదరుడు కైలాష్, అతని బాబాయ్, మామ, మరో ముగ్గురు యువకులు కలిసి ఇంటికి వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆస్తి కోసం చాలా సేపు గొడవ పడిన జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని చెన్నై సిటీ పోలీసులు గుర్తించారు.

 ఆగ్రా హోటల్ లో జయమాల అండ్ కో

ఆగ్రా హోటల్ లో జయమాల అండ్ కో

చెన్నై పోలీసులు పూణే వెళ్లి కోడలు జయమాలతో పాటు మూడు హత్యలు చెయ్యడానికి ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే జయమాల, ఆమె సోదరులు విలాస్, రాజీవ్ షిండే పారిపోయారని గుర్తించారు. ఇదే హత్యకేసులో మొదట జయమాల మరో సోదరుడు కైలాష్ ను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత జయమాల మొబైల్ ఫోన్ కు కైలాష్ తో ఫోన్ చేయించారు. ఆగ్రాలోని ఓ హోటల్ లో తలదాచుకున్న జయమాల, ఆమె సోదరుడు విలాస్, రాజీవ్ షిండేలను పోలీసులు అరెస్టు చేశారు.

 అన్న లాయర్..... అందుకే పక్కా స్కెచ్

అన్న లాయర్..... అందుకే పక్కా స్కెచ్

జయమాల సోదరుడు విలాస్ న్యాయవాది (లాయర్ ) కావడంతో భర్త, అత్తమామలను హత్య చేసినా కేసు నుంచి సులభంగా తప్పించుకోవడానికి అవకాశం ఉందని వీళ్లు పక్కా స్కెచ్ వేశారని పోలీసులు అంటున్నారు. తన సోదరుడు విలాస్ సహకారంతోనే తన భర్త సీతల్ కుమార్, తన అత్తమామలను హత్య చెయ్యాలని తాను డిసైడ్ అయ్యానని జయమాల అంగీకరించిందని పోలీసులు చెప్పారు.

 లగ్జరీ లైఫ్ కోసమే చేశాను

లగ్జరీ లైఫ్ కోసమే చేశాను

నా భర్త నా మట వినలేదు. భార్యను సుఖపెట్టలేని తెలివితేటలు నా భర్తకు లేవు, తన అత్త తనను టార్చర్ పెట్టిందని జయమాల పోలీసులకు చెప్పింది. నాకు ఏమీ కోరికలు ఉండవా అంటే తన భర్త, అత్తమామలు నీచంగా మాట్లాడారు, తాను లగ్జరీ లైఫ్ గడపాలని ముందు నుంచి అనుకున్నాను. అందుకు తన అత్తమామలు అడ్డుపడ్డారు, అందుకే సహనం కోల్పోయి ఆ ముగ్గురిని చంపేశామని జయమాల అంగీకరించిందని పోలీసులు అన్నారు.

 మాజీ మిలటరీ అధికారి అరెస్టు

మాజీ మిలటరీ అధికారి అరెస్టు

భర్త, అత్తమామలను హత్య చెయ్యడానికి జయమాల అండ్ కో రెండు రివాల్వర్లు ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. ఓ రివాల్వర్ జైపూర్ కు చెందిన రిటైడ్ మిలటరి అధికారి రాజీవ్ దూబేది అని గుర్తించారు. జయమాలకు రివాల్వర్ ఇచ్చిన మాజీ రిటైడ్ అధికారి రాజీవ్ దూబేని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ దూబే రివాల్వర్ తోనే దలీల్ చంద్ కుటుంబ సభ్యులను కాల్చిచంపారని, మరో రివాల్వర్ కు లైసెన్స్ ఉందని పోలీసులు అన్నారు.

 మాజీ లేడీ ఎయిర్ ఫోర్స్ అధికారి

మాజీ లేడీ ఎయిర్ ఫోర్స్ అధికారి

చెన్నై దలీల్ చంద్ కుటుంబ సభ్యులను హత్య చేసిన హంతకులు ఉపయోగించిన కారు రిటైడ్ మిలటరి అధికారి రాజీవ్ దూబే బార్య మధు దూబేది అని గుర్తించారు. రాజీవ్ దూబే భార్య మధుదూబే కూడా మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి అని పోలీసులు అన్నారు. జయమాల ఆమె కుటుంబ సభ్యలను హత్య చెయ్యడానికే వెలుతున్నారు అని తెలిసి వీళ్లు రివాల్వర్, కారు ఇచ్చారా ? తెలీకుండా ఇచ్చారా ? అంటూ ఆరా తీస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు చెప్పారు. దలీల్ చంద్ కుటుంబ సభ్యులను హత్య చేసిన తరువాత వారి ఇంటిలో రూ. 1. 80 లక్షలు, బంగారు నగలు ఎత్తుకెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Lady killer: Retired Army officer who was arrested in the chennai Sowcarpet triple murder case due to give gun to jayamala who killed her husband, father-in-law and mother-in-law because she needed money to live in luxury.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X