బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: విమానంలో లేడీతో పరిచయం PMOలో ఉద్యోగం అని మస్కా, రూ. 89 లక్షలు, కోటీశ్వరుడి ఫ్యామిలీకి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కోటీశ్వరుడి ఇంట్లో పుట్టిన మహిళ విమానాల్తో తిరుగుతోంది. దేశంలోని అనేక నగరాలతో పాటు విదేశాలకు వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తాను ప్రధాని కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని ఆ యువకుడు ఆమెను పరిచయం చేసుకున్నాడు. ప్రధాని కార్యాలయంలో ఇంటెలిజెన్స్, రా విభాగంలో తాను సీనియర్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నానని ఆమెను నమ్మించాడు. విమానంలో ప్రయాణించే సమయంలో ఇద్దరూ పిచ్చపాటిగా మాట్లాడుకున్నారు. తరువాత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరూ క్లోజ్ గా టచ్ లో ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని దేశాలకు చెందిన వీసాలకు ఆమె అప్లే చేసుకుంది. అయితే ఆమెకు వీసాలు మాత్రం రాలేదు.

కొన్ని దేశాలకు చెందిన వీసాలు ఇప్పిస్తానని, అందుకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి తక్కువ ఖర్చుతో నీకు వీసాలు ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ప్రధాని కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తనకు వీసాలు ఇప్పిస్తాడని ఆమె ఆశపడింది. యువకుడు చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ. 89 లక్షలు పంపించింది. అంతే మనోడు కోటీశ్వరుడి ఫ్యామిలీ పుట్టిన మహిళకు పంగనామాలు పెట్టేశాడు.

Wife: డబ్బు దాహం, బంధువులను పిలిపించి భార్య మీద రేప్ చేయించి వీడియో తీసిన భర్త, యూట్యూబ్ లో !Wife: డబ్బు దాహం, బంధువులను పిలిపించి భార్య మీద రేప్ చేయించి వీడియో తీసిన భర్త, యూట్యూబ్ లో !

 విమానంలో పరిచయం

విమానంలో పరిచయం

కోటీశ్వరుడి ఇంట్లో పుట్టిన కునాల్ సక్సేనా అలియాస్ కునాల్ అనే మహిళ విమానాల్తో తిరుగుతోంది. దేశంలోని అనేక నగరాలతో పాటు విదేశాలకు కునాల్ సక్సేనా వెళ్లి వస్తోంది. కునాల్ సక్సేనా అలియాస్ కునాల్ 2018లో కౌలలాంపూర్ నుంచి విమానంలో ప్రయాణించే సమయంలో బెంగళూరుకు చెందిన అరహత్ అలియాస్ ఆనంద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

 ప్రధాని కార్యాలయంలో అధికారి అంటూ ?

ప్రధాని కార్యాలయంలో అధికారి అంటూ ?

తాను ప్రధాని కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని ఆనంద్ విమానంలోనే కునాల్ సక్సేనాతో పరిచయం చేసుకున్నాడు. ప్రధాని కార్యాలయంలో ఇంటెలిజెన్స్, రా విభాగంలో తాను సీనియర్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నానని ఆనంద్ విమానంలో పక్కసీటులో కుర్చుకున్న కునాల్ సక్సేనాకు తియ్యటి మాటలు చెప్పి ఆమెను నమ్మించాడు.

 ఇటలీ వీసాలు రాలేదు

ఇటలీ వీసాలు రాలేదు

విమానంలో ప్రయాణించే సమయంలో ఆనంద్, కునాల్ సక్సేనా ఇద్దరూ పిచ్చపాటిగా మాట్లాడుకున్నారు. తరువాత కొన్ని సంవత్సరాల నుంచి కునాల్ సక్సేనా, ఆనంద్ ఇద్దరూ క్లోజ్ గా టచ్ లో ఉన్నారు. ఇదే సమయంలో ఇటలీతో పాటు మరో దేశానికి వెళ్లాలని కునాల్ వీసాలకు అప్లే సుకుంది, అయితే కునాల్ కు వీసాలు మాత్రం రాలేదు. కునాల్ కు విసాలు రాలేదు అనే విషయం మాయలోడు ఆనంద్ కు తెలిసిందిజ

 రూ. 89 లక్షలు స్వాహా

రూ. 89 లక్షలు స్వాహా

కొన్ని దేశాలకు చెందిన వీసాలు ఇప్పిస్తానని, అందుకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి తక్కువ ఖర్చుతో నీకు వీసాలు ఇప్పిస్తానని ఆనంద్ అతని స్నేహితురాలు కునాల్ ను నమ్మించాడు. ప్రధాని కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ఆనంద్ తనకు వీసాలు ఇప్పిస్తాడని కునాల్ ఆశపడింది. ఆనంద్ చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ. 89 లక్షలు పంపించింది. అంతే ఆనంద్ ఆడబ్బు స్వాహా చేసి కునాల్ కు కుచ్చటోపీ పెట్టాడు.

 మాయలోడు అరెస్టు

మాయలోడు అరెస్టు

వీసాలు ఇప్పిస్తానని నమ్మించి తనకు పంగనామాలు పెట్టేశాడని ఆలస్యంగా తెలుసుకున్న కునాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని బెళ్లందూరు పోలీసులు రాజాజీనగర్ లో నివాసం ఉంటున్న ఆనంద్ ను అరెస్టు చేశారు. అయితే ఆనంద్ దగ్గర మాత్రం డబ్బు రికవరీ కాలేదని, అతని ఇంట్లో 13 బ్యాంక్ పాస్ బుక్ లు చిక్కాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Lady: Man cheats woman Rs 89 lakh, he claimed Working in the PMO office, was an Intelligence and Raw officer arrested in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X