చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lady manager: బ్యాంకులో రూ. కోట్లు గోల్ మాల్ చేసిన మేడమ్, రెండు బ్రాంచ్ ల్లో ఏం చేసిందంటే ?

బ్యాంక్ లోని ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వివిద ఖాతాలకు కోట్ల రూపాయల నగదు బదిలీ చేసిన బ్యాంక్ లేడీ మేనేజర్ సైలెంట్ గా ఉద్యోగానికి వెళ్లి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: ఆమె బ్యాంక్ మేనేజర్, ప్రముఖ బ్యాంక్ కు చెందిన ఓ బ్రాంచ్ మేనేజర్ అయిన ఆమె ఆ బ్యాంక్ ఆర్థిక లావాదేవీల మీద పట్టుసాధించింది. కొన్ని నెలల వ్యవదిలో కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందని బ్యాంక్ ఉన్నతస్థాయి అధికారులకు తెలిసింది. బ్యాంక్ మేనేజర్ మీద పోలీసు కేసు పెట్టారు. బ్యాంక్ లోని ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వివిద ఖాతాలకు కోట్ల రూపాయల నగదు బదిలీ చేసిన బ్యాంక్ లేడీ మేనేజర్ సైలెంట్ గా ఉద్యోగానికి వెళ్లి వచ్చింది. మ్యాటర్ లీక్ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల విచారణలో బ్యాంక్ లేడీ మేనేజర్ గోల్ మాల్ వ్యవహారం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!

ఐడీబీఐ బ్యాంక్ లేడీ మేనేజర్ అరెస్ట్

ఐడీబీఐ బ్యాంక్ లేడీ మేనేజర్ అరెస్ట్

బ్యాంక్ లోని కస్టమర్ అనుమతి లేకుండా రూ. 4.92 కోట్లు ఇతరుల బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేశారన్న ఆరోపణలపై ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్‌ ను బెంగళూరులోని సంపంగిరామనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని

మిషన్ రోడ్‌లో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సజీలా గురుమూర్తి అలియాస్ సజీలా (34)ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు

కేసు పెట్టిన బ్యాంక్ అధికారులు

కేసు పెట్టిన బ్యాంక్ అధికారులు

మేడమ్ సజీలా నుంచి నుంచి రూ .23 లక్షల విలువైన బాండ్లు, ఒక కంప్యూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్‌ఎన్ సంగమేశ్వర ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు నిందితురాలు సజీలా ను అరెస్ట్ చేశారని ఐటీ హబ్ పోలీసు అధికారులు తెలిపారు.

కన్యాకుమారి టూ బెంగళూరు

కన్యాకుమారి టూ బెంగళూరు

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన సజీలా కొన్నేళ్లుగా నగరంలోని భారతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. బెంగళూరులోని మిషన్ రోడ్ లోని ఐడీబీఐ బ్రాంచ్‌లో సజీలా మేనేజర్‌గా పని చేశఆరు. గత ఏడాదిజూన్ 13వ తేదీ నుంచి అదే ఏడాది డిసెంబర్ 21వ తేదీ వరకు సజీలా మిషన్ రోడ్డులోని ఆ బ్రాంచ్ లో మేనేజర్ గా విధులు నిర్వహించారు. ఈ సమయంలో బ్యాంకుకు చెందిన ప్రముఖ ఖాతాదారుల ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండా డబ్బును విత్‌డ్రా చేసి వేరొకరి పేరిట ఎల్‌ఐసీ బాండ్లలో పెట్టుబడి పెట్టారని సజీలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గాంధీ నగర్ బ్రాంచ్ లో ఒకేరోజు రూ. 4. 92 కోట్లు ?

గాంధీ నగర్ బ్రాంచ్ లో ఒకేరోజు రూ. 4. 92 కోట్లు ?

బ్యాంక్ మేనేజర్ సజీలా ఒకేసారి రూ. 1. 44 కోట్లు వేరొకరి పేరుతో అక్రమంగా బదిలీ చేసిందనిన బ్యాంక్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. బెంగళూరులోని గాంధీనగర్ లోని ఐడీబీఐ బ్రాంచ్‌లో సజీలా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2022 డిసెంబర్ 23వ తేదీ ఒకే రోజు ఎల్ఐసీ బాండ్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్ ఖాతా నుండి ఒకేసారి రూ. 4. 92 కోట్లు అక్రమంగా ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేశారని వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో నిందితురాలు సజీలాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

బ్యాంక్ మేనేజర్ సజీలాను అరెస్టు చేసిన పోలీసులు బెంళూరులోని మూడవ ఏసీఎంఎం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. మరింత సమాచారం సేకరించడానికి నిందితురాలు సజీలాను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న కోర్టు బ్యాంక్ మేనేజర్ సజీలాను విచారణ చెయ్యడానికి ఆమెను పోలీసు కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కోసం సజీలా ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు పాల్పడింది అనే విషయంలో సంబంధించిన పత్రాలె ఇవ్వాలని కోరుతూ పోలీసు అధికారులు బ్యాంకు అధికారులకు లేఖ రాసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

టార్గెట్ రీచ్ కావడానికి ఇంత చేసిందా ?

టార్గెట్ రీచ్ కావడానికి ఇంత చేసిందా ?

ఐడీబీఐ బ్యాంకు అధికారులకు ఎల్‌ఐసీ బాండ్ల విక్రయం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్ అధికారులు, ఎల్ఐసీ అధికారులు బాండ్ల విక్రయాలపై ఒప్పందం చేసుకుకున్నారు. టార్గెట్ చేరుకోవడానికి నేను కస్టమర్ ఖాతాలో ఉన్న డబ్బును మరొకరి ఖాతాకు బదిలీ చేసానని, వారి పేర్ల మీద ఎల్ఐసీ బాండ్లను కొనుగోలు చేసానని, కస్టమర్ల అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసిన ఆ మొత్తం డబ్బు ఎల్‌ఐసీ బాండ్లపై పెట్టుబడి పెట్టినట్లు నిందితురాలు సజీలా విచారణలో అంగీకరించిందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే కేసు విచారణ తరువాతే నిజానిజాలు బయటకు వస్తాయని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.

పోలీసుల అదుపులో సజీలా మేడమ్

పోలీసుల అదుపులో సజీలా మేడమ్

ఖాతాదారుల సొమ్మును దోచుకున్న ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్‌ సజీలాను బెంగళూరులోని ఉప్పరపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ బ్రాంచ్‌లో సజీలా రూ. 18 కోట్లకు పైగా మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ అధికారుల ఆడిట్‌లో సజీలా మోసం బయటపడింది. గాంధీనగర్ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు సజీలా మద ఉప్పరపేట పోలీస్ స్టేషన్ లో మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఓ వ్యక్తికి సజీలా ఏకంగా రూ 5 కోట్లు ఇచ్చినట్లు సజీలా అంగీకరించిందని తెలిసింది. మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేశానని సజీలా పోలీసులకు చెప్పిందని సమాచారం. ప్రస్తుతం ఉప్పరపేట పోలీసుల అదుపులో ఉన్న సజీలా నుంచి బ్యాంక్ గోల్ మాల్ వ్యవహారం కేసుకు సంబంధించి మరింత సమాచారం బయటకు లాగాలని ఆమెను పోలీసు అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది నిందితులు అరెస్టు అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

English summary
lady manager: IDBI Bank lady manager Sajila arrested for stealing crores of rupees from customers' accounts in the bank in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X