వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lady: కామాంధుడికి బెయిల్, 2 వేల మంది మహిళల దుస్తులు ఫ్రీగా శుభ్రం చేసి ఐరన్ చెయ్యాలి, కోర్టు ఆర్డర్ !

|
Google Oneindia TeluguNews

పాట్నా: మహిళ మీద కన్ను వేసిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. బాధితురాలు కేసు పెట్టడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. విచారణ ఖైదీగా ఉన్న నిందితుడు తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును ఆశ్రయించాడు. నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి కొన్ని షరతులు పెట్టారు. రెండు వేల మంది మహిళల దస్తులు ఫ్రీగా ఉతికి శుభ్రం చేసి ఆ దస్తులును ఐరన్ చేసి ఇవ్వాలని, బట్టలు ఉతకడానికి అవసరం అయ్యే వాషింగ్ పౌడర్, సబ్బులు నిందితుడే కొనుగోలు చెయ్యాలని షరతులు విధించారు. అత్యాచారయత్నం కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి ఇలాంటి షరతులు పెట్టడంతో నిందితుడు అంగీకరించాడు. ఆరు నెలల పాటు నిందితుడు 2 వేల మంది మహిళల దుస్తులు శుభ్రం చేసి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో మహిళలకు గౌరవం పెరిగినట్లు అయ్యిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటున్నారు.

Illegal affair: భార్య ఇండోర్, ఔట్ డోర్ గేమ్, మంచం కింద ప్రియుడు, నిప్పంటించిన మొగుడు !Illegal affair: భార్య ఇండోర్, ఔట్ డోర్ గేమ్, మంచం కింద ప్రియుడు, నిప్పంటించిన మొగుడు !

మహిళ మీద కన్నుపడింది

మహిళ మీద కన్నుపడింది


బీహార్ లోని మధుబాని జిల్లాలోని ఓ గ్రామంలో లలన్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంత గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ మీద లలాన్ కుమార్ కన్నుపడింది. చాలా కాలం నుంచి ఆమెను అనుభవించాలని లలాన్ ప్రయత్నించాడు. ఏప్రిల్ 17వ తేదీ రాత్రి ఒంటరిగా ఉన్న మహిళ మీద లలాన్ అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.

జైల్లో కామాంధుడు

జైల్లో కామాంధుడు

మహిళలు కేకలు వెయ్యడంతో లలాన్ ఆరోజు తప్పించుకుని పారిపోయాడు. మరుసటి రోజు బాధితురాలు కేసు పెట్టడంతో నిందితుడు లలాన్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి లలాన్ కుమార్ జైల్లో విచారణ ఖైదీగా ఉంటున్నాడు. బెయిల్ మీద బయటకు రావాలని లలాన్ కుమార్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

షరతులు పెట్టిన న్యాయమూర్తి

షరతులు పెట్టిన న్యాయమూర్తి

విచారణ ఖైదీగా ఉన్న నిందితుడు లలాన్ కుమార్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని మధుబాని జిల్లా ప్రత్యేక కోర్టును ఆశ్రయించాడు. నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి జిల్లా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవినాష్ కుమార్ కొన్ని షరతులు పెట్టారు. కోర్టు పెట్టే షరతులు కచ్చితంగా పాటిస్తామని నిందితుడు లలాన్ కుమార్ తరపు న్యాయవాది కోర్టులో మనవి చేశారు.

2 వేల మంది దుస్తులు ఉతికి ఐరన్ చెయ్యాలి

2 వేల మంది దుస్తులు ఉతికి ఐరన్ చెయ్యాలి

లలాన్ కుమార్ రెండు వేల మంది మహిళల దస్తులు ఫ్రీగా ఉతికి శుభ్రం చేసి ఆ దస్తులును ఐరన్ చేసి ఇవ్వాలని, బట్టలు ఉతకడానికి అవసరం అయ్యే వాషింగ్ పౌడర్, సబ్బులు నిందితుడే కొనుగోలు చెయ్యాలని న్యాయమూర్తి అవినాష్ కుమార్ షరతులు విధించారు. అత్యాచారయత్నం కేసులో బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి అవినాష్ కుమార్ ఇలాంటి షరతులు పెట్టడంతో నిందితుడు లలాన్ కుమార్ న్యాయవాది అంగీకరించారు.

పక్కఊరు మహిళల దుస్తులు రెడీ చేస్తాము

పక్కఊరు మహిళల దుస్తులు రెడీ చేస్తాము


ఆరు నెలల పాటు నిందితుడు 2 వేల మంది మహిళల దుస్తులు శుభ్రం చేసి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో మహిళలకు గౌరవం పెరిగినట్లు అయ్యిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటున్నారు. లలాన్ కుమార్ నివాసం ఉంటున్న గ్రామంలో 425 మంది మహిళలు నివాసం ఉంటున్నారని, చుట్టుపక్కల ఊళ్లలో నివాసం ఉంటున్న మిగిలిన మహిళలు దస్తులు ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తామని ఆ గ్రామ పెద్ద స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
lady: Molestation accused gets bail after he promises to wash and iron two thousand womens clothes in Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X