వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈమె లేడీ నట్వర్‌లాల్: పెట్టుబడులు పెట్టమని చెప్పి..

40 మంది మహిళలకు మాయమాటలు చెప్పి, రూ.10 కోట్లు దోచుకుపోయిన లేడీ నట్వర్ లాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె పేరు పర్వీన్ మర్చంచ్. కానీ ఇప్పుడామెను అందరూ లేడీ నట్వర్‌లాల్ అని పిలుస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: 40 మంది మహిళలకు మాయమాటలు చెప్పి, రూ.10 కోట్లు దోచుకుపోయిన లేడీ నట్వర్ లాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె పేరు పర్వీన్ మర్చంచ్. కానీ ఇప్పుడామెను అందరూ లేడీ నట్వర్‌లాల్ అని పిలుస్తున్నారు.

గతంలో నట్వర్ లాల్ అనే ఘనుడు తాజ్ మహల్, ఎర్రకోటను అమ్మేసిన ఘనుడు. ఇప్పుడు ఆయన పేరునే ఈమెకు కూడా పెట్టి లేడీ నట్వర్ లాల్‌గా పిలుచుకుంటున్నారు. నలభై మందిని బురిడీ కొట్టించడంతో లేడీ నట్వర్ లాల్ అని పిలుస్తున్నారు.

Lady natwarlal weaves scheme, cheats 40 women of rs 10 crore

తన టెక్స్‌టైల్, డ్రైఫ్రూట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించవచ్చని 40 మంది మహిళలకు మాయమటలు చెప్పింది. వారి నుంచి రూ.10 కోట్లు దోచుకుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

2016లో బైకుల్లాకు చెందిన సుమైయాఖాన్‌తో పరిచయం చేసుకున్న పర్వీన్ తన గార్మెంట్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టాలని, చాలా లాభాలు వస్తాయని నమ్మబలికింది. దీంతో ఆమె ఖరీదైన సెల్‌ఫోన్లు, 900 గ్రాముల బంగారం, రూ.24 లక్షల నగదు ఇచ్చింది.

దాదాపు రూ.1.24 కోట్ల మేర ఇచ్చింది. ఆ తర్వాత తాను మోసపోయినట్లు సుమైయాఖాన్ గుర్తించింది. బంద్రాలోని బజార్‌లేన్‌కు చెందిన రూబి సయ్యద్‌దీ అదే పరిస్థితి. ఆమె టిఫిన్ సెంటర్‌ నడుపుతుండడంతో పర్వీన్‌తో పరిచయం ఏర్పడింది.

దానిని అవకాశంగా మలుచుకున్న పర్వీన్ ఆమెను తన బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరింది. పర్వీన్ తన వీధిలోనే తన పన్నెండేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తుండడంతో నమ్మిన రూబి తొలుత రూ.1.50లక్షలు పెట్టబడి పెట్టింది. కొద్ది రోజులకు రూ.1.70 లక్షలు తిరిగి ఇచ్చింది. దీంతో లాభాలు వస్తున్నాయని తెలిసి రూ.25 లక్షలు ఇచ్చింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్లినట్టు తెలిసి, మోసపోయినట్లు గుర్తించింది. వీరే కాదు, చాలామంది మహిళల నుంచి ఆమె డబ్బులు తీసుకున్నారు.

పర్వీన్‌పై ఇప్పటి వరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జనవరిలో మొదట్లో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారంటూ బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళ తన బంధువులను కూడా వదల్లేదని, వారిని కూడా మోసం చేసిందని పోలీసులు తెలిపారు.

English summary
As many as 40 women are running from pillar to post, frustrated and worried about their money after a woman, known as the ‘Lady Natwarlal’ in crime circles, apparently conned them all of around Rs 10 crore, on false promises of quick money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X