Journalist: టార్చర్ పెడుతున్న భర్త, ఇంట్లో శవమైన లేడీ జర్నలిస్ట్, పిన్ టూ పిన్ చెప్పిన సోదరుడు !
బెంగళూరు: ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న లేడీ జర్నలిస్ట్ ఆమె భర్తతో కలిసి అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. మీడియాలో పని చేస్తున్న లేడీ జర్నలిస్ట్ ఆమెప ని ఆమె చేసుకుంటున్నారు. లేడీ జర్నలిస్ట్ భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సంపాదిస్తున్న జీతం మొత్తం నువ్వు మీ పుట్టింటికి పంపిస్తున్నావా ? అంటూ భర్త లేడీ జర్నలిస్ట్ మీద దాడి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. లేడీ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పినా ఆమె భర్త మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది. రెండు రోజుల నుంచి లేడీ జర్నలిస్ట్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఫోన్ చేసినా ఆమె ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. లేడీ జర్నలిస్ట్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోని బాల్కనీ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ లో ఆమె ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం, బ్యాంకులో భార్యను పొడిచిపారేశాడు, బంగారు నగలు !

లేడీ జర్నలిస్ట్
రైటర్స్ మీడియా సంస్థలో శృతి (35) జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు. 2017లొ అనీష్ అనే యువకుడిని వివాహం చేసుకున్న శృతి బెంగళూరు చేరుకుని వైట్ ఫీల్డ్ లోని నల్లూరుహళ్లి రోడ్డు సమీపంలోని ఎస్, వి, మైఫేర్ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత అనీష్ అతని భార్య శృతితో సంతోషంగా ఉండేవాడని తెలిసింది.

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త
కొన్ని సంవత్సరాల క్రితం అనీష్ ను వివాహం చేసుకున్న లేడీ జర్నలిస్ట్ శృతి ఆమె భర్తతో కలిసి అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోనే నివాసం ఉంటున్నారు. మీడియాలో పని చేస్తున్న లేడీ జర్నలిస్ట్ శృతి ఆమెప ని ఆమె చేసుకుంటున్నారు. లేడీ జర్నలిస్ట్ శృతి భర్త అనీష్ బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

దంపతుల మద్య గొడవలు ?
కొంతకాలం నుంచి శృతి, అనీష్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సంపాదిస్తున్న జీతం మొత్తం నువ్వు మీ పుట్టింటికి పంపిస్తున్నావా ? అంటూ అనీష్ లేడీ జర్నలిస్ట్ శృతి మీద దాడి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. లేడీ జర్నలిస్ట్ శృతి కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పినా ఆమె భర్త అనీష్ మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది.

ఇంట్లో శవమైన లేడీ జర్నలిస్ట్
రెండు రోజుల నుంచి లేడీ జర్నలిస్ట్ శృతి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఫోన్ చేసినా ఆమె ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. లేడీ జర్నలిస్ట్ శృతి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ దగ్గరకు ఆమె సోదరుడు నిశాంత్ వెళ్లాడు. ఇంటి తలుపులు లాక్ చేసి ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో ఇంటి బాల్కనీ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ లో లేడీ జర్నలిస్ట్ శృతి ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. లేడీ జర్న్ లిస్ట్ శృతిని ఆమె భర్త అనీష్ హత్య చేశాడని సోదరుడు నిశాంత్ నారాయణన్ కేసు పెట్టాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.