Lady singer: ఎమ్మెల్యే రేప్ చేశాడు, కొడుకు, అల్లుడు కూడా వదల్లేదు. వీడియోతో బ్లాక్ మెయిల్, సింగర్!
లక్నో/ భోపాల్/ న్యూఢిల్లీ: అధికార పార్టీకి మిత్రపక్షం అయిన ఎమ్మెల్యే, ఆయన కొడుకు, మేనల్లుడు కలిసి తన మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ 25 ఏళ్ల లేడీ సింగర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది. ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి తనను ఆహ్వానించి అత్యాచారం చెయ్యడమే కాకుండా మరోసారి హోటల్ లో అత్యాచారం చేసి వీడియో తీసి పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. అనేక కేసులు అతని మీద నమోదు కావడంతో భయంతో తాను ఇంతకాలం కేసు పెట్టలేదని ఆ లేడీ సింగర్ ఆరోపించడం దూమరం రేపింది.
Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

యూపీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా
ఉత్దరప్రదేశ్ లో నేరాలు.... ఘోరాలకు ఏమాత్రం కొదవ లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉత్దరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. యూపీలో బీజేపీ మిత్రపక్షం అయిన నిర్మల్ ఇండియన్ షోషిత్ హమారా అమ్ దళ్ ( NISHAD Party) ఎమ్మెల్యే విజయ్ మిశ్రా తన మీద అత్యాచారం చేశాడని 25 ఏళ్ల లేడీ సింగర్ ఆరోపిస్తూ కేసు పెట్టింది.

ఎమ్మెల్యే ఇంట్లో ఏం జరిగిందంటే ?
2014లో ఎమ్మెల్యే విజయ్ మిశ్రా ఇంట్లో ఓ శుభకార్యం జరిగిందని, ఆ కార్యక్రమానికి తనను పిలిపించారని లేడీ సింగర్ అంటోంది. ఎమ్మెల్యే విజయ్ మిశ్రా ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి హాజరైన తన జీవితం నాశనం అయ్యిందని లేడీ సింగర్ ఆరోపించింది. నిషద్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా అతన ఇంటిలోనే తన మీద అత్యాచారం చేశాడని లేడీ సింగర్ ఆరోపించింది.

కొడుకు, మేనళ్లుడికి నేను బోనస్
2015లో వారణాసిలోని ఓ హోటల్ లో మరోసారి తన మీద ఎమ్మెల్యే విజయ్ మిశ్రా ఆత్యాచారం చేశాడని లేడీ సింగర్ ఆరోపించారు. తరువాత తనను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలని ఆ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా అతని కొడుకు, మేనల్లుడికి చెప్పాడని, అయితే ఆ ఇద్దరూ నేరుగా తనను ఇంటికి పిలుచుకుని వెళ్లలేదని, తన మీద గ్యాంగ్ రేప్ చేసిన తరువాత ఇంటి దగ్గర డ్రాప్ చేశారని లేడీ సింగర్ గోపిగంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని బధోహి జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ మీడియాకు చెప్పారు.

వీడియో తీసిన ఎమ్మెల్యే
తన మీద ఎమ్మెల్యే విజయ్ మిశ్రా అత్యాచారం చేసే సమయంలో అతను వీడియో తీశాడని, ఆ వీడియో అడ్డంపెట్టుకుని తన జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడని లేడీ సింగర్ ఆరోపించారు. అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసు కేసు పెట్టినా నిన్ను చంపేస్తామని, నీ కుటుంభాన్ని నాశనం చేస్తామని ఎమ్మెల్యే విజయ్ మిశ్రా బెదరించాడని లేడీ సింగర్ కేసు పెట్టిందని బధోహి ఎస్పీ రామ్ బదన్ సింగ్ మీడియాకు వివరించారు.

నా భయం నాది..... అందుకే ఆలస్యం
లేడీ సింగర్ పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్దరప్రదేశ్ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఎమ్మెల్యే విజయ్ మిశ్రా మీద అనేక కేసులు నమోదైనాయి. తన మీద అత్యాచారం చేసిన విజయ్ మిశ్రా ఎమ్మెల్యే కావడం, అతనికి అధికార పార్టీ మద్దతు ఉండటంతో ఇంతకాలం భయపడి ఈ విషయం బయటకు చెప్పలేదని లేడీ సింగర్ అంటోంది.

భూ కబ్జా కేసులో జైల్లో ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్ లో భూ కబ్జాకు సంబంధించిన కేసులో గత సెప్టెంబర్ నెలలో ఎమ్మెల్యే విజయ్ మిశ్రాను అక్కడి పోలీసులు అరెస్టు చేసి ఆగ్రా జైలుకు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడని తెలుసుకుని ఇప్పుడు ధైర్యంగా తాను ముందుకు వచ్చి రేప్ కేసు పెట్టానని లేడీ సింగర్ చెప్పిందని బధోహి జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ మీడియాకు చెప్పారు. ఎమ్మెల్యే విజయ్ మిశ్రాపై ఇప్పటికే అనేక కేసులు ఉండటంతో నిషద్ పార్టీ నాయకులు అతని తీరుతో హడలిపోతున్నారని తెలిసింది.