• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady teacher: పగలు పిల్లలకు పాఠాలు, రాత్రి బాయ్ ఫ్రెండ్స్ కు ?, మేడమ్ భర్త ?, కేసు రీఓపెన్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ శివగంగై: పెళ్లి చేసుకున్న దంపతులు సంతోంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భర్త సొంతంగా టిప్పర్ లారీ తీసుకుని అతను నడుపుకుంటున్నాడు. భార్య లేడీ టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త మరుసటి రోజు శవమైనాడు. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరికి చెప్పిన లేడీ టీచర్ ఆమె భర్త అంత్యక్రియలు పూర్తి చేసింది. భర్త చనిపోయాడని అతని భార్య సొంత అత్తమామలకు సమాచారం ఇచ్చింది. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని అతని తండ్రి పోలీసు అధికారులను ఆశ్రయించాడు. రెండు వారాల తరువాత శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించారు. ఇదే సందర్బంలో లేడీ టీచర్, ఆమె భర్త మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసు అధికారులు బిత్తరపోయారు. మేడమ్ మొబైల్ ఫోన్ లో లెక్కలేనంతమంది పురుషులతో బూతుల చాటింగ్ చేస్తోందని, గంటల పాటు మగాళ్లతో మాట్లాడుతోందని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది ?Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది ?

దంపతులకు కుమారుడు

దంపతులకు కుమారుడు

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని కారైకుడిలోని కాలనీవాసల్ ఏరియాలో జయప్రభు అలియాస్ ప్రభు (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 9 సంవత్సరాల క్రితం జయ ప్రభు దీపా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న జయ ప్రభు, దీపా దంపతులు సంతోంగా కాపురం చేశారు. దీపా, జయ ప్రభు దంపతులకు 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

భార్య లేడీ టీచర్

భార్య లేడీ టీచర్

జయ ప్రభు సొంతంగా టిప్పర్ లారీ తీసుకుని అతనే నడుపుకుంటున్నాడు. జయ ప్రభు భార్య దీపా కారైకుడిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో లేడీ టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఉదయం స్కూల్ కు వెలుతున్న దీపా సాయంత్రం ఇంటికి వెలుతోంది. ట్రిప్పర్ లారీ బాడుగులు తిప్పుతున్న జయ ప్రభు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెలుతున్నాడు.

రాత్రి ఇంటికి వెళ్లాడు.... ఉదయం శవం అయ్యాడు

రాత్రి ఇంటికి వెళ్లాడు.... ఉదయం శవం అయ్యాడు

నవంబర్ 21వ తేదీన రాత్రి జయ ప్రభు ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు జయ ప్రభు ఇంట్లో శవమై కనిపించాడు, తన భర్త జయ ప్రభు గుండెపోటుతో చనిపోయాడని దీపా సొంత అత్తమామలకు, బంధువులకు సమాచారం ఇచ్చింది. తన భర్త జయ ప్రభు గుండెపోటుతో చనిపోయాడని అందరిని నమ్మించిన దీపా అదేరోజు ఆమె భర్త జయ ప్రభు అంత్యక్రియలు పూర్తి చేసింది.

రెండు వారాలకు శవాన్ని బయటకు తీసి ?

రెండు వారాలకు శవాన్ని బయటకు తీసి ?

తన కొడుకు జయ ప్రభు మరణంపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని అతని తండ్రి ఆశీర్వాదం కారైకుడి ఏసీపీకి, స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం చెయ్యాలని మనవి చేశారు. తన కోడలు దీపా తీరు మీద మాకు అనుమానాలు ఉన్నాయని జయ ప్రభు పోలీసులకు చెప్పారు. రెండు వారాల తరువాత జయ ప్రభు శవాన్ని బయటకు తీసి శివగంగై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు పంపించారు.

మొబైల్ ఫోన్ తో లేడీ టీచర్ డ్రామాలు

మొబైల్ ఫోన్ తో లేడీ టీచర్ డ్రామాలు

తన కొడుకు జయ ప్రభు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే అందులో ఏదైనా సమాచారం ఉంటుందని బాధితుడి తండ్రి ఆశీర్వాధం పోలీసులకు మనవి చేశారు. జయ ప్రభు మొబైల్ ఫోన్ ఇవ్వాలని పోలీసు అధికారులు అతని భార్య దీపాకు చెప్పారు. తన దగ్గర ఫోన్ లేదని, ఇంట్లో వెతికి తరువాత ఇస్తానని చెప్పింది. మరుసటి రోజు దీపా ఆమె భర్త జయ ప్రభు మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చి డ్రామాలు ఆడింది.

మేడమ్ ఫోన్ లో ?

మేడమ్ ఫోన్ లో ?

జయ ప్రభు మొబైల్ ఫోన్ లో కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్ లు మొత్తం డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు. మొబైల్ ఫోన్ లోని డేటా మొత్తం రికవరి చేశారు. స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగించాలో సక్రమంగా తెలియని భర్త జయ ప్రభు మొబైల్ ఫోన్ లో అతని భార్య దీపా చాలా చేసిందని పోలీసులు గుర్తించారు.

లేడీ టీచర్ ఫోన్ లో బూతుపురాణం

లేడీ టీచర్ ఫోన్ లో బూతుపురాణం

పోలీసులు దీపాను తమదైన శైలిలో విచారణ చేశారు. ఇదే సందర్బంలో లేడీ టీచర్ దీపా, ఆమె భర్త జయ ప్రభు మొబైల్ ఫోన్ లోని సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు బిత్తరపోయారు. లేడీ టీచర్ దీపా మేడమ్ ఆమె మొబైల్ ఫోన్, భర్త మొబైల్ ఫోన్ లో లెక్కలేనంతమంది పురుషులతో బూతుల చాటింగ్ చేస్తోందని, గంటల పాటు మగాళ్లతో మాట్లాడుతోందని వెలుగు చూసింది.

భార్యను కంట్రోల్ లో పెట్టలేక భర్త ఆత్మహత్య

భార్యను కంట్రోల్ లో పెట్టలేక భర్త ఆత్మహత్య

ఈ విషయం తెలుసుకున్న జయ ప్రభు భార్య దీపాను దండించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది. భర్త జయ ప్రభు ఆత్మహత్య చేసుకోవడంతో తన విషయం బయటకు వస్తుందనే భయంతో దీపా గుండెపోటు డ్రామాలు ఆడిందని పోలీసులు అన్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఎఫ్ఐఆర్ మారుస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. ఆ దెబ్బతో లేడీ మేడమ్ దీపా కథ కొత్త మలుపు తిరిగింది. ఇంతకాలం లేడీ మేడమ్ దీపాతో టచ్ లో ఉన్న కుర్రాళ్లు, ఆమె బాయ్ ఫ్రెండ్స్ దెబ్బకు జెండా ఎత్తేశారని తెలిసింది. జయ ప్రభు, అతని భార్య, లేడీ టీచర్ దీపా మొబైల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారని తెలిసింది.

English summary
Lady teacher: Husband suspecting death near Sivagangai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X