బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవర్ తో పెళ్లికి నో చెప్పిన లేడీ టెక్కీ తల్లి, పక్కా ప్లాన్ తో తల్లి హత్య, ప్రియుడు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) తల్లి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. తల్లిని లేడీ టెక్కీ హత్య చేసిందని, సోదరుడిని హత్య చెయ్యడానికి విఫలయత్నం చేసి పరారైయ్యిందని పోలీసులు అంటున్నారు. తల్లిని హత్య చేసి రెండు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లేడీ టెక్కీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రియుడితో కలిసి లేడీ టెక్కీ చాకచక్యంగా తల్లి, సోదరుడి హత్యకు పక్కాప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!

మంచి ఉద్యోగం

మంచి ఉద్యోగం

బెంగళూరు నగరంలోని మారతహళ్ళిలోని ఓ ప్రసిద్ది చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో అమృత (33) అనే యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటిలో టెక్కీ అమృత తల్లి నిర్మల, సోదరుడు హరీష్ తో కలిసి నివాసం ఉంటోంది.

తల్లి దారుణ హత్య

తల్లి దారుణ హత్య

ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం ఇంటిలో నిర్మల దారుణ హత్యకు గురైయ్యింది. అదే రోజు నిర్మల కుమారుడు హరీష్ మీద ఇంటిలోనే హత్యాయత్నం జరిగింది. తరువాత ఇరుగు పొరుగు వారి సహాయంతో ప్రాణాలతో బయటపడిన హరీష్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రియుడితో కలిసి బైక్ లో పరార్

ప్రియుడితో కలిసి బైక్ లో పరార్

నిర్మల హత్యకు గురి కావడం, హరీష్ మీద హత్యాయత్నం జరగడంతో కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో నిర్మల హత్యకు గురైయ్యిందని మొదట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వీరి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు. లేడీ టెక్కీ అమృత ఇంటి సమీపంలో ప్రియుడితో కలిసి బైక్ లో పరారైయ్యిందని పోలీసులు గుర్తించారు.

టెక్కీ చేతిలో బ్యాగు

టెక్కీ చేతిలో బ్యాగు

బైక్ లో అమృత ఇంటి దగ్గరకు ఆమె ప్రియుడు వచ్చిన సందర్బంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తరువాత అమృత ఓ బ్యాగ్ తో పాటు ప్రియుడి బైక్ ఎక్కి అక్కడి నుంచి పరారైయ్యిందని పోలీసులు అంటున్నారు. నిర్మల హత్య జరిగి రెండు రోజులు అయినా ఇంత వరకు అమృత ఆచూకి మాత్రం చిక్కడం లేదని పోలీసులు చెప్పారు.

రూ. 15 లక్షల డ్రామా, లవర్ తో పెళ్లికి నో!

రూ. 15 లక్షల డ్రామా, లవర్ తో పెళ్లికి నో!

తాను రూ. 15 లక్షలు అప్పు చేశానని, అప్పులు ఇచ్చిన వారు ఈ రోజు ఆదివారం (ఫిబ్రవరి 2వ తేదీ) ఇంటి దగ్గరకు వస్తామని చెప్పారని, వారు ఇక్కడికి వస్తే పరువు పోతుందని, తల్లిని హత్య చేస్తే సమస్యలు తీరిపోతాయని అమృత ఆమె సోదరుడు హరీష్ కు చెప్పిందని, తల్లిని హత్య చెయ్యడానికి హరీష్ అంగీకరించలేదని పోలీసులు అన్నారు.

అయితే ప్రేమించిన వ్యక్తిని అమృత పెళ్లి చేసుకోవడానికి ఆమె తల్లి నిర్మల అంగీకరించలేదని, అందుకే ఆమెను హత్య చేసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తల్లి నిర్మలను హత్య చేసి పరారైన అమృత కోసం కేఆర్ పురం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Bengaluru: 33 year old techie Amrutha murdered mother and attempt to kill brother in K.R.Puram police station limits, Bengaluru. Now twist to case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X