• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady techie: జెండా ఎత్తేసిన మొగుడు, యూఎస్ కంపెనీ ఫ్రెండ్, ఏకంగా రూ. 10 లక్షలు, మూడు !

|

హైదరాబాద్/ చెన్నై: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న లేడీ టెక్కి కష్టాల్లో పడింది. ఇప్పటికే భర్తకు దూరం అయ్యిన లేడీ టెక్కీ ఆరేళ్ల కొడుకుతో ఒంటరి జీవితం గడుపుతోంది. తనకు, తన కొడుక్కి ఓ తోడు కావాలని ఆమె మరో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. మ్యాట్రిమోనీలో మంచి సంబంధం కోసం ఆ లేడీ టెక్కి వెతుకుతోంది. ఇదే సమయంలో 'బేగంపేట బుల్లెమ్మో' అంటు ఓ కేటుగాడు ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ఖరీదైన బహుమతులు పంపించిన కిలాడీగాడు హైదరాబాద్ ముద్దుగుమ్మకు మస్కా కొట్టి ఆమె నుంచి రూ. 10 లక్షల వరకు లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. బాధితురాలైన లేడీ టెక్కీ కేసు పెట్టడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కిలాడీ కేటుగాడి కోసం వేట మొదలుపెట్టాడు.

Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !

 భర్తకు దూరం అయిన లేడీ టెక్కి

భర్తకు దూరం అయిన లేడీ టెక్కి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని బేగంపేట ప్రాంతంలో 34 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపోనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాధిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా భర్తతో విడిపోయి తెగతెంపులు చేసుకున్న లేడీ టెక్కీ 6 ఏళ్ల కొడుకుతో కలిసి జీవిస్తోంది.

 నాకు, నా కొడుక్కి ఓ తోడు కావాలి

నాకు, నా కొడుక్కి ఓ తోడు కావాలి

తన కొడుకును, తనను చూసుకోవడానికి ఓ మంచి వ్యక్తి తోడు అవసరం అని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆ లేడీ టెక్కీ డిసైడ్ అయ్యింది. మ్యాట్రిమోనీలో మంచి వ్యక్తి కోసం, మంచి సంబంధం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఇప్పటికే జీవితంలో ఓ సారి దెబ్బ తినడంతో తొందరపాటు వద్దని ఆలస్యం అయినా మంచి నిర్ణయం తీసుకుందామని ఆమె కొంతకాలం వేచి చూసింది.

 కేటుగాడు ఎంట్రీ

కేటుగాడు ఎంట్రీ

ఓ సారి మ్యాట్రిమోనీలో బేగంపేట మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తన పేరు మోహుల్ కుమార్, తాను యూఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నానని, గుజరాత్ లో తనకు సొంత ఇల్లు, ఆస్తులు ఉన్నాయని బేగంపేట మహిళను పరిచయం చేసుకున్నాడు. తరువాత ఇద్దరూ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు.

 చిన్నచిన్న స్కెచ్ లు... భారీ ప్లాన్

చిన్నచిన్న స్కెచ్ లు... భారీ ప్లాన్

కొంతకాలానికి బేగంపేటలో నివాసం ఉంటున్న లేడీ టెక్కీని పెళ్లి చేసుకుంటానని మోహుల్ కుమార్ నమ్మించాడు. నిన్ను తప్పా ఎవ్వరిని పెళ్లి చేసుకోను అంటూ ఆమెకు ఖరీదైన కొన్ని నగలు, బహుమతులు పంపించి దగ్గర అయ్యాడు. గుజరాత్ లో ఉన్న తన ఆస్తుల విషయంలో గొడవలు అయ్యాయని, నువ్వు నాకు కొంచెం సహాయం చెయ్యాలని నమ్మించిన కేటుగాడు లేడీ టెక్కీ నుంచి రూ. 1. 50 లక్షలు తీసుకున్నాడు.

 మీ నగలు సీజ్ చేశారు

మీ నగలు సీజ్ చేశారు

కొంతకాలం తరువాత నీ కోసం ఖరీదైన బంగారు నగలు, విలువైన వస్తులు తీసుకువస్తుంటే ట్యాక్స్ కట్టలేదని కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారని, వాటిని విడిపించాలంటే రూ. 6 లక్షలు అవసరం అవుతుందని మాయమాటలు చెప్పిన కేటుగాడు మోహుల్ కుమార్ లేడీ టెక్కీ నుంచి రూ. 6 లక్షలు అతని అకౌంట్ లో జమ చేయించుకున్నాడు.

 రూ. 10 లక్షలు..... పత్తాలేడు

రూ. 10 లక్షలు..... పత్తాలేడు

అనంతరం వివిద కారణాలు చెప్పిన మోహుల్ కుమార్ లేడీ టెక్కిని నమ్మించి సుమారు రూ. 10 లక్షలకు పైగా అతని అకౌంట్ లో డిపాజిట్ చేయించుకున్నాడు. చివరికి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కిలాడీ బేగంపేట బుల్లెమ్మకు క్రీమ్ బిస్కెట్ తినిపించి మాయం అయిపోయాడు. తాను మోసపోయానని గుర్తించిన బేగంపేట మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఎక్కడ ఉన్నాడో కేటుగాడు ?

ఎక్కడ ఉన్నాడో కేటుగాడు ?

బేగంపేట లేడీ టెక్కి చెప్పిన వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మ్యాట్రిమోనీలతో కొందరి జీవితాలు బాగుపడుతున్నా మరి కొందరి జీవితాలు ఇలా తెల్లారిపోతున్నాయని అనేక చోట్ల వెలుగు చూస్తున్నాయని, అయినా ఇలాంటి మోసాలకు మాత్రం చెక్ పడటం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

English summary
Lady techie: Cyber crook dupes Software engineer of Rs 10 lakh after befriending her through Matrimonial site in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X