Lady: రైల్వేస్టేషన్ లోని రైలు భోగీలో శవమై కనిపించిన లేడీ, ఏం జరిగింది, ఎప్పుడు !
చెన్నై/తాంబరం: చెన్నై నుంచి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ కు రైలు సంచరిస్తోంది. చెన్నై నుంచి నాగర్ కోవిల్ వెలుతున్న రైలులో కన్యాకుమారి, చెన్నై, కాంచీపురం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఈ మార్గంలో సంచరిస్తుంటారు. రైలు చెన్నై చేరుకున్న తరువాత సెంట్రల్ రైల్వే స్టేషన్ లో నిలుపుతుంటారు. నిలిపి ఉన్న రైలు భోగీలో మహిళ అనుమానాస్పదంగా శవమై కనిపించడంతో అక్కడి సిబ్బంది హడలిపోయారు.
ఎప్పటిలాగే నాగర్ కోవిల్ నుంచి వచ్చిన రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేసన్ లో నిలిపివేశారు. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లిపోయిన తరువాత రైలులోని ప్రతిభోగీ శుభ్రం చేస్తుంటారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో సిబ్బంది రైలు ఎక్కి ప్రతి భోగీ శుభ్రం చెయ్యడం మొదలు పెట్టారు.

ఓ భోగీ నుంచి దుర్వాసన రావడంతో రైలు శుభ్రం చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి భోగీలు అన్నీ పరిశీలించారు. ఆ సమయంలో ఓ భోగీలు ఓ మహిళ శవమైకనిపించడంతో సిబ్బంది హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ చనిపోవడంతో ఆమె శరీరం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ చేరుకుని పరిశీలించి మహిళ శవాన్ని ఆసుపత్రికి తరలించారు. సుమారు 40 ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో చనిపోయిందని, ఆమె అనారోగ్యంతో చనిపోయిందా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.