• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్షలు ఖర్చుపెట్టాడు.. పేదొన్నని ప్రచారం చేసుకున్నాడు.. కోట్లు గడించాడు..!!

|

చెన్నై : పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి ఇది పాత సామెతే .. కానీ దీనిని అచ్చంగా యాప్ట్ చేసుకున్నాడో రైతు. అదేంటి రైతు అన్వయించుకోవడం ఏంటనే కదా సందేహం. ఔను తమ ఆచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అయితే ఇందులో పేదలమని యాడ్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి లక్షలు ఖర్చుపెట్టాడు. ఇదేమీ విడ్డూరమో కానీ అతను కోట్లు గడించాడు. నమ్మడం లేదా ? అయితే ఈ స్టోరీ చదవండి.

క్యాష్ చేసుకున్నాడు..

క్యాష్ చేసుకున్నాడు..

సమాజంలో కొత్త కొత్త ఆచారాలు, వింత పోకడలు వస్తున్నాయి. అయితే డబ్బు సంపాదించడమే పరమాధిగా భావిస్తున్నారు కొందరు. తప్పలేదు .. తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ తమ ఆచారాలు, సాంప్రదాయాలను కూడా వాడుకోవడమే కాస్త ఇబ్బంది అనిపిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే .. తమిళనాడు పుదుక్కోట జిల్లాలో ఒక ఆచారం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు భోజనాలు పెట్టి చదివింపులు చేస్తారు. సాధారణంగా పెళ్లిలో ఈ తంతు జరుగుతుంది. అయితే ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు అలా చేస్తారు. కీరామంగళం తాలుకాలోని వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కూడా భోజనాలు పెట్టాడు. అయితే అతను భోజనాలు కోసం 15 లక్షలు ఖర్చుపెట్టగా చదివింపులు కోట్లలో రావడమే విశేషం.

భోజనాలతో కరోడ్ పతి

భోజనాలతో కరోడ్ పతి

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పిన కృష్ణమూర్తి భోజనాల కోసం భారీగానే ఖర్చుపెట్టాడు. రూ. 15 లక్షలు ఖర్చు చేశాడంటే అర్థం చేసుకోండి. అతిథులకు మేక మాంసం వడ్డించాడు. ఇందుకోసం టన్ను మాంసం .. అదేనండి వెయ్యి కిలోల మాంసం వడ్డి పెట్టారు. భోజన ఏర్పాట్లే కాదు .. ఆహ్వాన పత్రికల్లోనూ ముందే ఉన్నారుు. 50 వేల పత్రికలు ముద్రించి పంచివేశారు. అయితే ఆయన భోజనాలకు చాలా మంది వచ్చి ఆరగించారు. ఇందులో అనుమానం లేదు. ఇక చదివింపులకు వచ్చేసరికి కృష్ణమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఖర్చుపెట్టింది రూ.15 లక్షలు కాగా .. ఆయనకు వచ్చింది ఎంతో తెలుసా రూ.4 కోట్లు .. అవును ఇదీ నిజం.

బ్యాంకు ఉద్యోగుల సేవలు

బ్యాంకు ఉద్యోగుల సేవలు

చదివింపులు ఆ స్థాయిలో ఉండటంతో లెక్కింపు సాధారణంగా కృష్ణమూర్తి, అతని కుటుంబసభ్యులు చేస్తే ఎలా ఉంటుంది. అందుకే బ్యాంకు సిబ్బంది రంగంలోకి దిగారు. చదివింపులను లెక్కించేందుకు క్యాష్ మిషన్ కూడా ఉపయోగించడం విశేషం. ఈ సమయంలో పోలీసు బందోబస్త్ కూడా ఏర్పాటు చేశారు. బ్యాంకు సిబ్బంది చదివింపులను లెక్కించి అక్షరాలా రూ.4 కోట్లని చెప్పారు. దీంతో పేద రైతు పేరుతో లక్షాధికారి అయిన కృష్ణమూర్తి ఒక్కరోజులో కోటిశ్వరుడు అయ్యాడు. అదేమరి తన ఆచార, సంప్రదాయాన్ని కరెక్టుగా వాడుకోవడం అంటే ఇదే మరి.

చేతులు కాల్చుకోకుండి ..

చేతులు కాల్చుకోకుండి ..

కృష్ణమూర్తి వ్యవహారం ఓకే. ఆయన తాను పేద రైతునని చెప్పి 15 లక్షలు ఖర్చుచేశాడు. మేక మాంసం వడ్డించాడు. వచ్చిన అతిథులు సంతోషంగా చదివింపులు చేశారు. ఇదీ ఆయనకు వర్తించింది, లక్కీ లాటరీలో కోటిశ్వరుడు అయ్యాడు. మరి ఇలా తాము చేస్తామని వేరేవరు ప్రయత్నిస్తే ఫలితం ఎలా ఉంటుంది. వారు పెట్టిన భోజనానికి అతిథులు రాకుంటే పరిస్థితి ఏంటీ ? ఒకవేళ వచ్చిన చదివింపులు ఆ స్థాయిలో లేకుండే ఎవరు బాధ్యులు. చేతిలో ఉన్న లేకున్నా అప్పో సప్పో చేసి భోజనాలు పెడితే .. పెట్టిన నగదు కూడా తిరిగిరాకుంటే సిచుయేషన్ ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. సో తమిళనాడులో ఆచారం ఉంది. కాబట్టి కాస్త ఖర్చుపెట్టి క్రతువు చేశారు. కానీ మిగతా చోట్ల అలా చేసి చేతులు కాల్చుకోకండి. కృష్ణమూర్తిలో ఒకరోజులో కోటీశ్వరులు కాలేరు. అదీ కాదు కదా బికారీగా మారే ప్రమాదం పొంచి ఉంది. రైతులారా, సోదరులారా జర జాగ్రత్త. ఇలాంటి చూసి ఆనందించాలే .. కానీ ప్రయోగాలు చేయొద్దు. నిపుణలైన మేధావులు కూడా ఇదే సలహా ఇస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a custom in the Pudukkotta district of Tamil Nadu. Those who are in financial difficulties have lunch. This is usually done at the wedding. But those in financial trouble here do. Krishnamurthy from Vadagadu village in Keeramangalam taluk also served meals. However, he has spent Rs 15 lakh on meals and the readings come in crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more