వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ, మరాఠీల మధ్య చిచ్చుపెట్టిన కేపీసీసీ మహిళా వింగ్ అధ్యక్షురాలు: కర్ణాటకలో !

కర్ణాటకలోని బెలగావి జిల్లాను మహారాష్ట్రలో కలిపిస్తే తాను మహారాష్ట్ర జెండాను చేతిలో పట్టుకుని జై అంటానని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచనల వ్యాఖ్యలు చ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని బెలగావి జిల్లాను మహారాష్ట్రలో కలిపిస్తే తాను మహారాష్ట్ర జెండాను చేతిలో పట్టుకుని జై అంటానని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచనల వ్యాఖ్యలు చేసి కన్నడిగులు, మరాఠీల మధ్య చిచ్చుపెట్టారు.

బెల్గాంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాం జిల్లా వివాధం సుప్రీం కోర్టులో ఉందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వస్తే బెళగావి జిల్లాను మహారాష్ట్రలో కలిపేస్తారని చెప్పారు.

 Lakshmi Hebbalkar controversial speeck regarding Belagavi

ఆ సమయంలో తాను మహారాష్ట్ర జెండాను చేతిలో పట్టుకుని జై మహారాష్ట్ర అంటానని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా బెలగావి విషయంలో ఇప్పటి వరకు బహిరంగంగా ఎవ్వరూ ఇలా మాట్లాడలేదని ఆమె అన్నారు.

బెలగావి విషయంలో నేను ఇలాగే మాట్లాడుతాను, నాకు ఆ ధైర్యం ఉంది, మరెవరికి అంత ధైర్యం లేదు, నేను ఎవ్వరికీ భయపడను అంటూ లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు జై కొట్టే వాళ్లు అక్కడికే వెళ్లిపోవాలని, మారాష్ట్రంలో ఉండకూడదని కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ మండిపడ్డారు.

 Lakshmi Hebbalkar controversial speeck regarding Belagavi

లక్ష్మీ హెబ్బాళ్కర్ మాటలు ఆమె వ్యక్తిగతం, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత మాట్లాడుతానని పరమేశ్వర్ మీడియాకు చెప్పారు. లక్ష్మి హెబ్బాళ్కర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె దిష్టి బోమ్మను కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Karnataka Congress Women's section Chief Lakshmi Hebbalkar has sparked the controversy on saying that, if Belagavi gets merged with Maharashtra she will celebrate it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X