వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనాలు చెప్తా, యూపీఏపై బాంబులే: లలిత్‌మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను మరిన్ని సంచలనాలు బయటపెడతానని హెచ్చరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సీనియర్ మంత్రులుగా ఉన్న వారి పేర్లను ప్రస్తావిస్తూ ఆయన హెచ్చరిక ట్వీట్ చేశారు.

తాను వెల్లడించిన వివరాలు వారి పైన బాంబుల వర్షం కురిపిస్తాయనీ, మునుపటి ప్రధానమంత్రి కార్యాలయాన్ని అవి ఇరుకున పెడతాయని తెలిపాడు. సంబంధం లేని వారి రాజీనామాల కోసం డిమాండ్లు వస్తున్నాయని, త్వరలో తుఫాను రాబోతుందని హెచ్చరించాడు.

త్వరలో అనేక రాజీనామాలు అవసరమవుతాయన్నాడు. అంతా బయటపెట్టే అవకాశం తనకు లభించిందని, ఎలాంటి బాంబులు కురవబోతున్నాయో చూసి మీరే నిర్ణయించాలని, ప్రభుత్వాల మధ్య నడిచిన రహస్య ఈ లేఖలూ బహిర్గతం చేస్తానని ట్వీట్ చేశారు.

 Lalit Modi declares war on Twitter, warns detractors of 'sensational disclosures'

16 కేసుల్లో లలిత్‌ మోదీకి త్వరలో ఈడీ జరిమానా నోటీసులు!

విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 16 కేసుల్లో ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీకి,
ఇతరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తుది జరిమానా నోటీసులను జారీ చేయనుంది. సి20 క్రికెట్‌ పోటీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై జరుపుతున్న విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది.

ఈ కేసులతోపాటు విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన, హవాలా లావాదేవీలకు సంబంధించిన రెండు కేసులపైనా దర్యాప్తు చేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. వీటిలో లలిత్‌ మోదీ పాత్రపై దర్యాప్తు జరుగుతోందని చెప్పాయి. ఆయనపై మనీ లాండరింగ్‌ కేసు కూడా ఉందని వివరించాయి.

ఇది 2009లో క్రికెట్‌ మీడియా హక్కుల కేటాయింపులో నిధుల దుర్వినియోగానికి సంబంధించిందని పేర్కొన్నాయి. టి20 వ్యవహారాల్లో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద 16 కేసుల దర్యాప్తు జరుగుతోందని, అవి తుది దశలో ఉన్నాయని చెబుతున్నారు.

అంటే రానున్న నెలల్లో నిందితులకు జరిమానాకు సంబంధించి తుది ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని, వీరిలో లలిత్‌ మోడీ సహా పలువురు ఐపీఎల్‌, బీసీసీఐ నేతలు ఉన్నారని, ఈ కేసుల్లో దాదాపు రూ.1600 కోట్ల మేర ఉల్లంఘనలు జరిగాయని, గరిష్ఠ స్థాయిలో దీనికి మూడు రెట్లు జరిమానా విధింపునకు అవకాశం ఉందని చెబుతున్నారు.

English summary
Lalit Modi declares war on Twitter, warns detractors of 'sensational disclosures'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X